Ap News: మచిలీపట్నం గురుకుల పాఠశాలలో తీవ్ర జ్వరాల కలకలం

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో అస్వస్థతకు గురైన 14 మంది...

Published : 06 Dec 2021 14:48 IST

మచిలీపట్నం‌: కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో అస్వస్థతకు గురైన 14 మంది విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. విద్యార్థులంతా శని, ఆదివారాల్లో ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వయసుల వారీగా పిల్లలకు వివిధ వార్డుల్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ నివాస్ ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. వాతావరణ మార్పులతో వచ్చే వైరల్ జ్వరాలతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు కలెక్టరు తెలిపారు. విద్యార్థులందరికీ కరోనా, డెంగీ నెగెటివ్ రిపోర్టులు వచ్చాయన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని.. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించినట్లు కలెక్టరు నివాస్‌ చెప్పారు.

గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్య, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థుల అస్వస్థతపై మంత్రి నివేదిక కోరారు. విద్యార్థులకు అందించే వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని