TS News: త్వరలోనే సీడ్‌హబ్‌గా సిద్దిపేట: హరీశ్‌రావు

సిద్దిపేట త్వరలోనే సీడ్‌ హబ్‌గా మారనుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. విత్తనోత్పత్తికి ఈ జిల్లా అన్ని విధాలా అనుకూలమని చెప్పారు.

Updated : 25 Dec 2021 11:44 IST

సిద్దిపేట: సిద్దిపేట త్వరలోనే సీడ్‌ హబ్‌గా మారనుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. విత్తనోత్పత్తికి ఈ జిల్లా అన్ని విధాలా అనుకూలమని చెప్పారు. సిద్దిపేటలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ భవనానికి భూమిపూజ చేసిన అనంతరం హరీశ్‌రావు మాట్లాడారు. ‘‘డిమాండ్‌ ఉన్న వాణిజ్య పంటలను రైతులు సాగు చేయాలి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసింది. రైతుల పోరాటంతోనే నల్ల చట్టాలను రద్దు చేశారన్నారు. ఆహార భద్రత అంశం కేంద్రం పరిధిలో ఉంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రానిది ద్వంద్వనీతి. కేంద్ర వైఖరిని తెరాస నేతలు రైతులకు అర్థమయ్యేలా చెప్పాలి’’ అని హరీశ్‌రావు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని