Ap News: విలీనానికి అంగీకరించని పాఠశాలలకు గ్రాంటు నిలిపివేస్తారా?: హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ పాఠశాలల విలీన ప్రక్రియ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ చినవీరభద్రుడు విచారణకు హాజరయ్యారు. విలీనానికి అంగీకరించని పాఠశాలలకు గ్రాంటు నిలిపివేస్తారా? అని విచారణ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది....

Updated : 29 Sep 2021 19:02 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ పాఠశాలల విలీన ప్రక్రియ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ చినవీరభద్రుడు విచారణకు హాజరయ్యారు. విలీనానికి అంగీకరించని పాఠశాలలకు గ్రాంటు నిలిపివేస్తారా? అని విచారణ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది. ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంపై యాజమాన్యాలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని.. గ్రాంట్‌ కూడా నిలిపివేయమని చినవీరభద్రుడు కోర్టుకు వివరించారు. ఈ మేరకు 13 జిల్లాల డీఈఓలతో టెలికాన్ఫరెన్స్‌లో సూచనలు చేసినట్లు చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను అక్టోబర్‌ 4వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని