TS News: జేఎన్‌టీయూహెచ్‌లో స్వర్ణోత్సవాలను ప్రారంభించిన తమిళిసై

దేశంలోనే మొట్టమొదటి టెక్నలాజికల్‌ యూనివర్సిటీ జేఎన్‌టీయూ హైదరాబాద్‌

Updated : 03 Oct 2021 16:40 IST

హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదటి టెక్నలాజికల్‌ యూనివర్సిటీ జేఎన్‌టీయూ హైదరాబాద్‌ అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. దేశంలోనే జేఎన్‌టీయూహెచ్‌కు మంచి పేరుందని కితాబిచ్చారు. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌ 50వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకల లోగోను ఆవిష్కరించారు. దీంతో పాటు పూర్వ విద్యార్థుల కోసం సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యార్థికి కావాల్సిన అన్ని విద్యా సౌకర్యాలు జేఎన్‌టీయూలో ఉన్నాయని గవర్నర్ తెలిపారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌కు సిరిసిల్లలో ఓ ఇంజినీరింగ్ కాలేజీ, సుల్తాన్‌పూర్‌లో ఫార్మా కళాశాల ఏర్పాటుకు అనుమతి లభించిందని ఉపకులపతి నర్సింహారెడ్డి వెల్లడించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని