Ts News: తెలంగాణలో మరిన్ని ఆవిష్కరణలు.. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం 

ఆవిష్కరణలకు సంబంధించి ప్రపంచస్థాయి నెట్‌వర్క్‌ అయిన ప్లగ్‌ అండ్‌ ప్లే టెక్‌ సెంటర్‌ హైదరాబాద్‌లో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. భారత్‌లో తమ మొదటి కేంద్రాన్ని

Updated : 30 Oct 2021 19:51 IST

హైదరాబాద్‌: ఆవిష్కరణలకు సంబంధించి ప్రపంచస్థాయి నెట్‌వర్క్‌ అయిన ప్లగ్‌ అండ్‌ ప్లే టెక్‌ సెంటర్‌ హైదరాబాద్‌లో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. భారత్‌లో తమ మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌ వేదికగా డిసెంబరులో ప్రారంభించనున్నట్టు పారిస్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశం సందర్భంగా నెట్‌వర్క్‌ ప్రతినిధులు ప్రకటించారు. ఆవిష్కరణలకు ఇప్పటికే ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణలో ఇన్నోవేషన్‌ ఎకోసిస్టంకు మరింత ఊతమిస్తుందని కేటీఆర్‌ అన్నారు. 

ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ బృందం సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏరో స్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో నైపుణ్యాభి వృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. బోర్డెక్స్‌ మెట్రో పోలిస్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. చారిత్రక లక్సెంబర్గ్‌ ప్యాలెస్‌లో కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం జరిగింది. సుస్థిర పట్టణాల రూపకల్పనలో బోర్డెక్స్‌ మెట్రోపోలిస్‌ సహకారం అందించనుంది. 2015లో చేసుకున్న సహకార ఒప్పందానికి అనుగుణంగా తాజా ఒప్పందం జరిగింది. ఫార్మా కంపెనీ సర్వియర్‌ ప్రతినిధులతోనూ కేటీఆర్‌ బృందం సమావేశమైంది. తెలంగాణలో ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల అభివృద్ధి, ఇక్కడ ఉన్న అవకాశాలను వివరించారు. 2022 లో జరగనున్న బయోఏసియా సదస్సులో పాల్గొనాలని సర్వియర్ ప్రతినిధులను కేటీఆర్ ఆహ్వానించారు. హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణలో భాగస్వామ్య సంస్థ అయిన కియోలిస్ గ్రూప్ ప్రతినిధులతోనూ కేటీఆర్ సమావేశమయ్యారు. ఫ్రెంచ్ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ ఆసియా డైరెక్టర్ పిలిఫ్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. డిజిటల్ టెక్నాలజీ సంస్థ థేల్స్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్... మెడిసిన్ ఫ్రం ది స్కై సహా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ను తెలంగాణ వినియోగిస్తున్న తీరును వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని