TS News: ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలి: కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు లేఖ

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసుల మధ్య వ్యవధి తగ్గించాలని మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి లేఖ రాశారు. ప్రస్తుతం రెండు డోసుల మధ్య 12 వారాల గడువు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగానే..

Published : 04 Dec 2021 01:18 IST

హైదరాబాద్‌: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసుల మధ్య వ్యవధి తగ్గించాలని మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి లేఖ రాశారు. ప్రస్తుతం రెండు డోసుల మధ్య 12 వారాల గడువు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగానే 4 నుంచి 6 వారాలకు సెకండ్‌ డోస్‌ వ్యవధిని కుదించాలని లేఖలో పేర్కొన్నారు. 12 వారాల గడువు నేపథ్యంలో రెండో డోస్‌ ఇబ్బంది కరంగా మారిందని పేర్కొన్న హరీశ్‌రావు.. వలస కూలీలు మొదటి డోస్‌ తీసుకున్న తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. మొదటి డోస్‌ వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరిచినప్పటికీ ఆయా వివరాలు రాష్ట్రాలకు పరిమితం అవుతున్నాయని.. ఫలితంగా రెండో డోస్‌ ఇబ్బందిగా మారుతుందన్నారు. మరో వైపు ఫ్రంట్‌లైన్‌ వారియర్‌లు, హై రిస్క్‌ గ్రూప్‌, హెల్త్‌కేర్‌ సిబ్బంది వ్యాక్సిన్‌ తీసుకుని ఇప్పటికే  దాదాపు 8 నుంచి 10 నెలలు అవుతున్న నేపథ్యంలో ఆయా విభాగాల వారికి బూస్టర్‌ డోస్‌ ఇచ్చేందుకు అనుమతివ్వాలని లేఖలో పేర్కొన్నారు. కొత్త వేరియంట్‌ నేపథ్యంలో బూస్టర్‌డోస్‌ గురించి ఆలోచించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని