AP News: ఏపీ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీ కమిషన్‌ అసహనం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీ కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పెద్ద ఎత్తున మతమార్పిడులు జరుగుతున్నాయని జాతీయ ఎస్సీ కమిషన్‌కు పెద్ద

Updated : 24 Sep 2022 15:42 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీ కమిషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఏపీలో పెద్ద ఎత్తున మతమార్పిడులు జరుగుతున్నాయని జాతీయ ఎస్సీ కమిషన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన కమిషన్‌ నివేదిక అందజేయాలని గత జూన్‌లో ఏపీ సీఎస్‌కు లేఖ రాసింది. ఎస్సీ కమిషన్‌ లేఖపై ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో జాతీయ ఎస్సీ కమిషన్‌ మరోసారి ఏపీ సీఎస్‌కు లేఖ పంపింది. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రంలో మత మార్పిడులపై నివేదిక పంపడంలో జాప్యం చేస్తున్నందుకు కమిషన్ అసహనం వ్యక్తం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని