Sonu sood: మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న సోనూసూద్

అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న పేద మహిళకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

Published : 02 Jan 2022 16:48 IST

కుప్పం: అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న పేద మహిళకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం అత్తినతం గ్రామంలో సాలమ్మ తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందిపడుతోంది. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండటంతో సహాయం చేయాలని సోనూసూద్ ఫౌండేషన్ ని ఆశ్రయించారు. గుడుపల్లి మండలానికి చెందిన సోనూసూద్ ఫాండేషన్ సభ్యుడు పురుషోత్తం చొరవ తీసుకుని విషయాన్ని సోనూసూద్ కి తెలియజేశారు. వెంటనే స్పందించిన ఆయన వైద్య పరికరాలు సమకూర్చారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న తమ విషయం తెలిసి సహాయం అందించిన సోనూసూద్ కి, వారి ఫౌండేషన్ సభ్యులకు సాలమ్మ కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని