AP News: రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్లు.. వాహనదారుల ఆందోళన

రవాణాశాఖ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా షోరూంలలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారు

Updated : 30 Dec 2021 17:29 IST

అమరావతి: రవాణాశాఖ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా షోరూంలలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారు ఇబ్బందులు పడుతున్నారు. జనవరి 1 నుంచి రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరగనున్నాయి. ఈనేపథ్యంలో.. అంతకు ముందే వాహనాలు కొనేందుకు వాహనదారులు ప్రయత్నిస్తున్నారు. వాహనం డెలివరీ చేయకపోవడంతో పలు చోట్ల వినియోగదారులు డీలర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. రేపటికల్లా వెబ్‌సైట్‌ లో సాంకేతిక సమస్య పరిష్కరిస్తామని రవాణాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రేపు ఉదయం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని