TS News: వెలిగొండ ప్రాజెక్టుకు ఏఐబీపీ నిధులా?: కేంద్రానికి తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన (ఏఐబీపీ) నిధుల అంశంపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ..

Updated : 27 Aug 2021 13:15 IST

హైదరాబాద్‌: కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన (ఏఐబీపీ) నిధుల అంశంపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా ట్రైబ్యునల్‌లో కేటాయింపులు లేవని.. వరద జలాల ఆధారంగా ఆ ప్రాజెక్టును చేపట్టారని పేర్కొన్నారు. వెలిగొండకు అనుమతులు లేవన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్‌ వెలుపలకు నీరు తరలిస్తున్నారని.. ఈ అంశంపై గతంలోనే ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.

అనుమతి లేని ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద నిధులివ్వడంపై ఈఎన్‌సీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఎంత వరకు సబబని లేఖలో ప్రశ్నించారు. ఏఐబీపీ కింద వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే అర్హత ఉందో లేదో పునఃపరిశీలించాలని కేంద్ర జల్‌శక్తి శాఖను ఈఎన్‌సీ మురళీధర్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని