Ts News: వాటివల్ల ఏపీ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం ఉండదు: తెలంగాణ ఈఎన్‌సీ

విభజన చట్టం ప్రకారం డీపీఆర్‌లను సీడబ్ల్యూసీకి పంపించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డును (జీఆర్‌ఎంబీ) తెలంగాణ ఈఎన్‌సీ మరళీధర్‌ కోరారు. ఈ మేరకు జీఆర్‌ఎంబీ

Published : 03 Nov 2021 16:10 IST

హైదరాబాద్‌: విభజన చట్టం ప్రకారం డీపీఆర్‌లను సీడబ్ల్యూసీకి పంపించాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డును (జీఆర్‌ఎంబీ) తెలంగాణ ఈఎన్‌సీ మరళీధర్‌ కోరారు. అక్టోబర్ 26న రాసిన లేఖకు కొనసాగింపుగా ప్రాజెక్టుల డీపీఆర్‌ల అంశాన్ని ప్రస్తావిస్తూ జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్‌ మరో లేఖ రాశారు.

‘‘చౌటుపల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్‌, ముక్తేశ్వర లిఫ్ట్‌, తుపాకులగూడెం, మోడికుంటవాగు, సీతారామ ప్రాజెక్టులు కొత్తవి కాదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు 967.94 టీఎంసీలు కేటాయించారు. నిర్దేశిత టీఎంసీలకు అనుగుణంగానే ప్రాజెక్టులు చేపట్టాం. వీటి వల్ల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం ఉండదు. 2014కు ముందు చేపట్టిన ప్రాజెక్టులపై బోర్డుకు ఎలాంటి అధికారం ఉండదు. ఈ అంశాల పరిశీలనకు సీడబ్ల్యూసీలో డైరెక్టరేట్లు ఉన్నాయి. రాయలసీమ లిఫ్ట్‌ డీపీఆర్‌ను కృష్ణా బోర్డు సీడబ్ల్యూసీకి పంపించింది. డీపీఆర్‌లకు కేంద్ర జల సంఘమే అనుమతులు ఇస్తుంది. ఆ అధికారం బోర్డులకు లేదు. డీపీఆర్‌ల ఆమోదంపై కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. వాటిని వెంటనే సీడబ్ల్యూసీకి పంపించాలి’’ అని ఈఎన్‌సీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని