Ts High Court: 111 జీవో రద్దు చేసే ఆలోచన ఉంటే ఎందుకు చెప్పడం లేదు: హైకోర్టు

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలను నియంత్రించే జీవో 111ని రద్దు చేసే ఆలోచన ఏమైనా ఉందా? అనే విషయాన్ని రేపు తెలపాలని రాష్ట్ర

Updated : 24 Aug 2021 21:58 IST

హైదరాబాద్: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలను నియంత్రించే జీవో 111ని రద్దు చేసే ఆలోచన ఏమైనా ఉందా? అనే విషయాన్ని రేపు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీవో 111తో పాటు కోకాపేట భూముల వేలంపై దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.

జీవో 111ని రద్దు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. జీవో రద్దు చేసే ఆలోచన ఏమైనా ఉందా? అని అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావును ధర్మాసనం ప్రశ్నించింది. జీవో రద్దు చేసే ఆలోచన ఉంటే.. దానిపై ఇన్ని రోజులుగా విచారణ జరపాల్సిన అవసరం ఏముందని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. జీవో 111ను రద్దు చేసే ఆలోచన ఉంటే ఆ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని అదనపు ఏజీని హైకోర్టు నిలదీసింది. అసమగ్రంగా వివరాలు సమర్పించి కోర్టును ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికా కథనంపై తనకు స్పష్టత లేదని.. ప్రభుత్వాన్ని సంప్రదించి రేపు పూర్తి వివరాలు చెబుతానని అదనపు ఏజీ తెలిపారు. విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.. ఉన్నతాధికారులను కూడా పిలిపించుకోవాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని