TTD: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. తేదీలు ఖరారు చేసిన తితిదే

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ఖరారు చేసింది. అక్టోబర్‌ 7వ తేదీ నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు

Published : 26 Sep 2021 17:55 IST

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ఖరారు చేసింది. అక్టోబర్‌ 7వ తేదీ నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు తెలిపింది. కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తితిదే పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్‌ 5న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని జరపనున్నట్లు వెల్లడించింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి వాహనసేవల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

ఏ రోజు.. ఏ సేవ..

06-10-2021: అంకురార్పణ (సాయంత్రం 6 నుంచి 7 గంటల వ‌ర‌కు)

07-10-2021: ధ్వజారోహణం (ఉదయం)  - పెద్దశేష వాహనసేవ (సాయంత్రం)

08-10-2021: చిన్నశేష వాహ‌నసేవ (ఉదయం)  - హంస వాహనసేవ (సాయంత్రం)

09-10-2021: సింహ వాహ‌న సేవ (ఉదయం)- ముత్యపుపందిరి వాహ‌న సేవల (సాయంత్రం)

10-10-2021:  క‌ల్పవృక్ష వాహ‌నసేవ (ఉదయం)- సర్వభూపాల వాహనసేవ (సాయంత్రం)

11-10-2021: మోహినీ అవ‌తారం (ఉదయం)- గ‌రుడ‌ వాహనసేవ‌ (సాయంత్రం)

12-10-2021: హ‌నుమంత వాహ‌నసేవ (ఉదయం)- గ‌జ వాహ‌నసేవ (సాయంత్రం)

13-10-2021: సూర్యప్రభ వాహ‌నసేవ (ఉదయం)- చంద్రప్రభ వాహ‌నసేవ (సాయంత్రం)

14-10-2021: రథోత్సవానికి బ‌దులుగా సర్వభూపాల వాహనసేవ (ఉదయం)- అశ్వ వాహ‌నసేవ (సాయంత్రం)

15-10-2021: ప‌ల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం (ఉదయం)- ధ్వజారోహణం (సాయంత్రం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని