AP News: కొనసాగుతున్న అల్పపీడనం.. కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నవంబరు 18 నాటికి దక్షిణ కోస్తా - ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంగా చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.

Updated : 24 Sep 2022 15:42 IST


అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నవంబరు 18 నాటికి దక్షిణ కోస్తా - ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంగా చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. కోస్తాంధ్ర - తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే సమయానికి మరింత బలపడే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమలో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. 18, 19 తేదీల్లోనూ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వానలు పడే సూచలు ఉన్నాయి. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలియజేసింది. సముద్రం అల్లకల్లోలంగా మారే సూచనలు ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్ల రాదని సూచించింది. రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని