
Updated : 24 Oct 2021 11:49 IST
TS News: మందకృష్ణ మాదిగను పరామర్శించిన కేంద్రమంత్రులు
హైదరాబాద్: ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కేంద్ర మంత్రులు పరామర్శించారు. ఇటీవల స్నానాల గదిలో జారిపడి కోలుకుంటున్న ఆయనను నగరంలోని డీడీ కాలనీలో ఉన్న నివాసంలో కేంద్రమంత్రులు మురుగన్, కిషన్‌రెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్యే రఘునందన్ కలిశారు. ఈ సందర్భంగా వారు మందకృష్ణమాదిగతో కలిసి అల్పాహారం చేశారు. ఈ మధ్యాహ్నం 2గంటలకు బోయిన్‌పల్లిలో నిర్వహించే ఎస్సీ ఉద్యోగుల 5వ జాతీయ మహా సభలో కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు.
Tags :