Andhra News: వ్యాను బోల్తా.. నేలపాలైన 200 కేసుల బీర్లు

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై బీరుసీసాలతో వెళ్తున్న వ్యాన్‌ అదుపుతప్పి బోల్తా పడింది.

Published : 05 Jun 2023 17:58 IST

అనకాపల్లి పట్టణం: అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై బీరుసీసాలతో వెళ్తున్న వ్యాన్‌ అదుపుతప్పి బోల్తా పడింది. సోమవారం మధ్యాహ్నం వ్యాను అనకాపల్లి డిపో నుంచి నర్సీపట్నానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దాదాపు 200 కేసుల బీరు సీసాలు నేలపాలయ్యాయి. వీటిలో పగలని సీసాలను తీసుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు