TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నల్గొండకు చెందిన అన్నా చెల్లెళ్లు అరెస్టు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో ముగ్గురిని సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. 

Published : 24 May 2023 21:14 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో ముగ్గురిని సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన నల్గొండకు చెందిన అన్నా చెల్లెళ్లయిన విక్రమ్, దివ్యలతో పాటు ఏఈ ప్రశ్నపత్రం విక్రయించినందుకు రవికిషోర్ అనే వ్యక్తిని తాజాగా సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 39కి చేరింది.

దర్యాప్తుపై ఆరా తీసిన సీవీ ఆనంద్‌..

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తు గురించి సైబరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఆరా తీశారు. హిమాయత్‌ నగర్‌లోని సిట్‌ కార్యాలయానికి వెళ్లిన ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సిట్‌ నేతృత్వం వహిస్తున్న అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వ్యక్తిగత కారణాల వల్ల సెలవులో ఉన్నారు. దీంతో దర్యాప్తు పురోగతి గురించి  తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని