Stalin: ఐదేళ్ల లోపు చిన్నారులకు స్టాలిన్‌ సర్కార్‌ తీపి కబురు!

తమిళనాడులోని స్టాలిన్‌ ప్రభుత్వం ఐదేళ్ల లోపు చిన్నారులకు తీపి కబురు అందించింది. అన్ని రకాల ప్రభుత్వ....

Published : 05 May 2022 20:24 IST

చెన్నై: తమిళనాడులోని స్టాలిన్‌ ప్రభుత్వం ఐదేళ్ల లోపు చిన్నారులకు తీపి కబురు అందించింది. అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో వారికి ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తమిళనాడు రవాణా మంత్రి ఎస్‌.ఎస్‌. శివశంకర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. 2022-23కు సంబంధించి  తన శాఖలో చేపట్టనున్న కొత్త కార్యక్రమాలను ఆయన వివరించారు. ఐదేళ్ల లోపు పిల్లలు అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. అయితే, ప్రస్తుతం తమిళనాట మూడు నుంచి 12 ఏళ్ల వయసు కలిగిన పిల్లలకు సగం ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకొనేందుకు సుదూర బస్సుల్లో లగేజీ స్థలంలో కొంత భాగాన్ని పార్శిల్, కొరియర్‌ సర్వీసులను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్టు తెలిపారు. ఆయన ప్రకటించిన అంశాల్లో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ నిబంధనల ప్రకారం ఆటోమేటెడ్ ట్రావెల్ టికెట్‌ వ్యవస్థను ప్రవేశ పెట్టడం, అన్ని ప్రజా రవాణా మార్గాలను ఏకీకృతం చేయడంతో పాటు ప్రభుత్వ రవాణా సంస్థల్లోని ప్రయాణికుల సమస్యలు పరిష్కరించేందుకు ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేయడం వంటివి ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని