Top 10 News @ 9AM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 04 May 2023 09:01 IST

1. పిలుస్తోంది నౌకాదళం!.. నేవీ అధికారులుగా అవకాశం

బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ విద్యార్హతలతో భారతీయ నౌకాదళంలో కొలువుదీరే అవకాశం వచ్చింది. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో 242 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. వీటికి అవివాహిత స్త్రీ, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మార్కులతో అభ్యర్థులను వడపోసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపినవారిని శిక్షణలోకి తీసుకుంటారు. అనంతరం సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లో చేరిపోవచ్చు. ఆకర్షణీయ వేతనం, ప్రోత్సాహకాలూ పొందవచ్చు! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆ రాజ కిరీటం వెనుక..

ఛార్లెస్‌-3 పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న బ్రిటిష్‌     రాజ కిరీటం, సింహాసనం వెనుక ఆసక్తికరమైన చరిత్ర దాగుంది. అంతే కాదు.. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న అనేక     వివాదాలకు ఈ కిరీటం, సింహాసనం ప్రత్యక్ష సాక్షులు.  ప్రస్తుతం ఛార్లెస్‌-3 ధరించబోయే    రాజ కిరీటాన్ని సెయింట్‌ ఎడ్వర్డ్‌ కిరీటం అంటారు. 444 నవరత్నాలు, మాణిక్యాలు పొదిగి, పూర్తి  బంగారంతో తయారైన దీని బరువు 2.23 కిలోలు. 1661లో దీనిని ఛార్లెస్‌-2 పట్టాభిషేకం కోసం తయారు చేయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భుజాల బరువును తగ్గిద్దాం..

మనం ఏ పని చేయాలన్నా భుజాలు బలంగా ఉండాలి. బలహీనంగా ఉంటే వంటగదిలో చిన్న చిన్న బరువులు ఎత్తేందుకు కూడా సహకరించవు.  ఆహారపు అలవాట్లలో తేడా వచ్చినా భుజాల కండరాల్లో కొవ్వు పేరుకుంటుంది. కాబట్టి ప్రతి రోజూ వాటికి తగిన వ్యాయామం ఇవ్వాలి. అదెలాగో చదివేయండి మరి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పసిడి కథా నేరచిత్రమ్‌!

దశాబ్దాలుగా బంగారం దందా సాగిస్తున్న నగరంలోని దళారులు, ఏజెంట్ల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ప్రత్యర్థుల గుట్టు పోలీసులకు చేరవేస్తున్నారు. రంగంలోకి దిగుతున్న పోలీసుల్లో కొందరు ఇరువర్గాలకు రాజీ కుదిర్చి కమీషన్‌ కింద పసిడి కొట్టేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఆభరణాలు తయారు చేస్తామంటూ ముడిబంగారం తీసుకొని కార్మికులు పారిపోయినా కొందరు వ్యాపారులు నోరుమెదపలేకపోతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్మగ్లింగ్‌ గుట్టు బయటపడుతుందని మౌనం వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కళ్లు చెదిరే.. ఆర్జన

ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యంత విలాసవంతమైన ప్రాంతం, అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగే కేంద్రం.. పటమట. ఆ కేంద్రంలో కొలువు దీరేందుకు ఆయన పోరాడి న్యాయస్థానానికి వెళ్లి మరీ పోస్టింగ్‌ దక్కించుకున్నారు. సరిగ్గా.. ఆరునెలలు తిరిగే సరికి అవినీతి నిరోధక శాఖ దృష్టి ఆయనపై పడింది. ఆయన ఆదాయంపై లెక్కలు తీశారు. ఒక్కసారిగా దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించారు. గత రెండు రోజులుగా పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ ఆర్జ రాఘవరావు ఆస్తులపై సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సమయంలోపు పనులు సవాలే..!

మేడారం మహాజాతర.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.. కోటికి పైగా భక్తులు తరలివచ్చే తెలంగాణ కుంభమేళా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో జాతర నిర్వహించనున్నట్లు బుధవారం పూజారులు ప్రకటించారు. మహాజాతరకు సరిగ్గా 9 నెలల పైగా సమయం ఉంది. జాతర అభివృద్ధి, ఏర్పాట్లకు ప్రతిసారీ సమయం సరిపోవడం లేదు. నిధుల విడుదలలో జాప్యం వల్ల ఆలస్యమవుతోంది. ఈసారైనా గడువులోపు పనులు పూర్తి చేయాలంటే ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం ముందుకు కదలాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పెళ్లికెందుకు తొందర.. చదువుకోనీ ముందర..

‘ఎంతో ఖర్చు చేశాం. ఇప్పుడు పెళ్లి ఆపేస్తే పరువు పోతుంది. ఇబ్బంది పెట్టవద్దంటూ వేడుకున్నారు. అయినా అధికారులు వినలేదు. మాట వినకపోతే పెళ్లి కుదిర్చిన వారు, సహకరించిన వారు, పెళ్లి చేస్తున్న వారు అందరూ చట్టపరమైన చర్యలకు గురవుతారని హెచ్చరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో పెళ్లి ఆపేశారు. గత ఏడాది నర్సీపట్నం పురపాలక సంఘంలో చోటు చేసుకున్న ఘటన ఇది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భద్రాద్రి రామయ్యా.. ఆన్‌లైన్‌లో నీసేవలేవయ్యా?

దేవాదాయ శాఖ అలసత్వంతో రాములవారు ఆన్‌లైన్‌లోకి రాలేకపోతున్నారు. అంతర్జాలం అనేది అందని ద్రాక్షగా మారింది. ఆఫ్‌లైన్‌ సేవలకే ఈ కోవెల పరిమితమన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. సాంకేతికంగా ప్రధాన కోవెళ్లు ముందుకు దూసుకుపోతుంటే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఆశించిన మేర ప్రగతి సాధించడం లేదు. సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి భద్రగిరిలో నిర్వహించే పూజా క్రతువుల సమాచారం తెలిపే మార్గాలు కరవయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Osmania University: పట్టాతో ఉద్యోగం.. ఉస్మానియా విశ్వవిద్యాలయం కొత్త పంథా

విద్యాబోధనతో పాటు ప్రతిభగల విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం కొత్త పంథాతో ముందుకు వెళ్తోంది. డిగ్రీ, పీజీ విద్యార్థులకు కోర్సులు పూర్తైన వెంటనే ఉద్యోగాలు లభించేలా వర్సిటీ అధికారులు.. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల తరహాలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. విద్యుత్తు వినియోగదారులపై... మరో బాదుడు!

‘ఏ జన్మలో చేసుకున్న పాపమో అనుభవిస్తున్నాం.’ అనే మాటలు తరచూ వింటుంటాం. ప్రస్తుతం విద్యుత్తు బిల్లులు చూసి వినియోగదారులు ‘ ఎవరో వాడుకున్న కరెంటుకు ఇప్పుడు మేము కష్టాలు అనుభవిస్తున్నాం’ అంటూ ఏకరవు పెడుతున్నారు. సాధారణంగా నెల ప్రారంభం నుంచి విద్యుత్తు వినియోగదారులకు బిల్లుల జారీ జరుగుతుంది. ఈ మేరకు ఏప్రిల్‌కు సంబంధించిన విద్యుత్తు వినియోగ బిల్లులను ఎస్పీడీసీఎల్‌ మంగళవారం నుంచి జారీ చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని