Pamban Bridge: పడవల కోసం తెరుచుకున్న పంబన్‌ బ్రిడ్జి

భారత్‌లో మొట్టమొదటి సముద్రపు వంతెన పంబన్ బ్రిడ్జ్ (Pamban Bridge) పడవల కోసం మరోసారి తెరుచుకుంది. వంతెన పైకి లేవగానే పడవలు ఆ మార్గం ద్వారా పయనించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు, పర్యాటకులు అక్కడికి తరలివచ్చారు. తమిళనాడులోని రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపే ఈ వంతెన 2.2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దేశంలో సముద్రంపై నిర్మించిన అతిపెద్ద వంతెన ఇదే కావడం విశేషం.

Published : 03 May 2023 17:12 IST

Tags :

మరిన్ని