Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Apr 2024 09:21 IST

1. ‘నా.. నా’లుక వరకే మీరు

‘నా ఎస్సీలు... నా ఎస్టీలు’ అంటూ మైకులు పగిలేలా మాటలు చెప్పే జగన్‌.. చేతల్లో ఆయా వర్గాలకు తీరని ద్రోహం చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ఆశయమని వేదికలపై పలుకుతూ.. తన అయిదేళ్ల పాలనలో వారి బతుకులనే సంక్షోభంలో పడేశారు. పూర్తి కథనం

2. మంత్రులకు సవాల్‌!

లోక్‌సభ ఎన్నికలు మంత్రులకు సవాలుగా మారాయి. పలు లోక్‌సభ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్‌ఛార్జిగా నియమించిన కాంగ్రెస్‌.. ఆయా నియోజకవర్గాల్లో నాయకులను సమన్వయపరచడం, కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు గెలుపు బాధ్యతలను అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు రాష్ట్రవ్యాప్తంగా దృష్టి సారించినా, మంత్రులకు ప్రత్యేకంగా నియోజకవర్గాల బాధ్యతలను పార్టీ అప్పగించింది.పూర్తి కథనం

3. ఉన్నోళ్లు వద్దని.. ఆళ్లోళ్లు ముద్దని!

ఉమ్మడి జిల్లాలో కొత్త వ్యక్తులు దిగారు. ఓటర్లకు, నాయకులకు పంపకాలకు యువతను దించారు. వైకాపా కార్యకర్తలో, ఐప్యాక్‌ టీం సభ్యులో కానీ.. నగరం, పట్టణాల్లోని కల్యాణ మండపాలు, ఇతర ఖాళీ గృహాలను వసతి కింద తీసుకుని బస చేస్తున్నారు. సంచులు వేసుకుని గ్రామాల బాట పట్టారు. అభ్యర్థులపై నమ్మకం లేని వైకాపా అధిష్ఠానం తన సొంత కార్యకర్తలను రంగంలోకి దింపింది.పూర్తి కథనం

4. కాలేయానికి.. అధిక కొవ్వు ముప్పు

నగరంలో కాలేయ కొవ్వు (ఫ్యాటీ లివర్‌) సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్‌ తర్వాత చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం పెట్టగా.. ఇప్పటికీ కొన్ని కొనసాగిస్తున్నాయి. ఇలాంటి నిశ్చల జీవనశైలితో చాలామందిలో ఫ్యాటీ లివర్‌ ముప్పు పెరుగుతోందని వైద్యుల పరిశీలనలో తేలింది. గతంలో ప్రతి 10- 15 మందిలో ఒకరికి బయట పడితే.. ప్రస్తుతం ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉంటోంది. పూర్తి కథనం

5. వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!

అధికారంలోకి రావడానికి జగన్‌ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. తీరా అధికారం దక్కించుకున్నాక రివర్స్‌ పాలన ప్రారంభించి, నమ్మిన ఓటర్లకు చుక్కలు చూపించారు. అలాంటి బాధిత వర్గంలో పోలీసులూ ఉన్నారు. వారాంతపు సెలవుపై ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీని వారు నమ్మారు.పూర్తి కథనం

6. కనుమరుగైన హెలికాప్టర్‌ నియోజకవర్గం

భద్రాచలం లోక్‌సభ స్థానానికి హెలికాప్టర్‌ నియోజకవర్గంగా పేరుండేది. ఈ స్థానంలో వచ్చిన మార్పులు అన్నీఇన్నీ కావు. దేశ ప్రధానులు సైతం ఇక్కడి ఎంపీలను పేరు పెట్టి పిలిచేవారంటే అది నాయకుల గొప్పతనంతో పాటు ఈస్థానానికి ఉన్న ప్రత్యేకతను చాటుతుంది. కేవలం విస్తీర్ణపరంగా కాకుండా దండకారణ్యంగా ఈ నియోజకవర్గం ప్రసిద్ధి చెందింది.పూర్తి కథనం

7. గురివింద దొడ్లో అధికార మంద

ఈ నెల 22న బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సమయంలో ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌ కానిస్టేబుల్‌ రత్నబాబు అలియాస్‌ గోపి హల్‌చల్‌ చేశాడు. ఈ ప్రక్రియ మొత్తం ఎన్నికల పరిశీలకులు డేగకన్నుతో పరిశీలిస్తుంటారనే అంశంపై అవగాహన ఉన్నా పట్టించుకోలేదు. విధులకు ఎగనామం పెట్టేసి మరీ అతను ప్రణీత్‌రెడ్డి పక్కనచేరి అంగరక్షకుడిగా హంగామా సృష్టించాడు.పూర్తి కథనం

8. ఎండకు తాళలేం.. ఎన్నికల విధులకు వెళ్లలేం

ఎన్నికల విధుల పట్ల కొందరు ఉద్యోగులు ఆసక్తి చూపట్లేదు. రకరకాల కారణాలు చెప్పి మినహాయింపు కోరుతున్నారు. నిత్యం సుమారు వంద నుంచి 200ల మంది ఉద్యోగులు లేఖలు ఇస్తుండటమే అందుకు నిదర్శనం. జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం చుట్టూ వారంతా చక్కర్లు కొడుతున్నారు. ఇదేంటని కొందరు అధికారులను ‘ఈనాడు’ ఆరా తీయగా.. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పారు.పూర్తి కథనం

9. నగరవాసి.. నీటికి అల్లాడి

వేసవికి భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు, జలమండలి సరఫరా చేసే నీటి పరిమాణం సైతం తగ్గుతోంది. అవసరాలకు సరిపడా నీరు లభించక అల్లాడుతున్న జనాన్ని ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. మరోవైపు ‘తక్కువ ధరకే శుద్ధజలం’ లక్ష్యం నీరుగారిపోయింది. ప్రధాన రైల్వే స్టేషన్లను పట్టించుకుంటున్న ద.మ.రైల్వే ఎంఎంటీఎస్‌ స్టేషన్లను పట్టించుకోవడం లేదు.పూర్తి కథనం

10. శత్రువును కూడా అభినందించాలనే.. ఈటలను గెలుస్తున్నావన్నా

‘‘శుభకార్యంలో ఒకరికొకరం ఎదురు పడ్డాం.. గతంలో కలిసి పనిచేశాం.. శత్రువైనా అభినందించాలని అనుకున్నా.. అందుకే మల్కాజిగిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో నువ్వు గెలుస్తున్నావు అని చెప్పా. గతంలో కూడా నాపై ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వజ్రేష్‌ యాదవ్‌ను కూడా నువ్వు గెలుస్తున్నావన్నా.. అన్నంత మాత్రాన ఆయన గెలవలేదు.. ఇది కూడా అంతే’’ అని మేడ్చల్‌ ఎమ్మెల్యే సీహెచ్‌ మల్లారెడ్డి పేర్కొన్నారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని