logo

కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్‌ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు

నగరంలో కాలేయ కొవ్వు (ఫ్యాటీ లివర్‌) సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్‌ తర్వాత చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం పెట్టగా.. ఇప్పటికీ కొన్ని కొనసాగిస్తున్నాయి.

Updated : 28 Apr 2024 08:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో కాలేయ కొవ్వు (ఫ్యాటీ లివర్‌) సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్‌ తర్వాత చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం పెట్టగా.. ఇప్పటికీ కొన్ని కొనసాగిస్తున్నాయి. ఇలాంటి నిశ్చల జీవనశైలితో చాలామందిలో ఫ్యాటీ లివర్‌ ముప్పు పెరుగుతోందని వైద్యుల పరిశీలనలో తేలింది. గతంలో ప్రతి 10- 15 మందిలో ఒకరికి బయట పడితే.. ప్రస్తుతం ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉంటోంది. మరోవైపు వర్క్‌ ఫ్రం హోం తర్వాత కదలని జీవనశైలి, ఆహారపు అలవాట్లు కేసులు పెరగడానికి మరో కారణమని వైద్యులు విశ్లేషిస్తున్నారు.

ప్రధాన కారణాలు.. ఒకేచోట కూర్చొని గంటల తరబడి పనిచేయడం, ఫుడ్‌ డెలివరీ యాప్‌లు వచ్చాక ఇంటికే ఆహారం తెప్పించు కుంటున్నారు. అవసరానికి మించి కేలరీలు తీసుకోవడంతో కొవ్వుగా కాలేయంలో పెరుగుతోంది. చివరికి లివర్‌లో గడ్డలు ఏర్పడి లివర్‌ సిరోసిస్‌కు దారితీస్తోంది.

  • మద్యపానంతో కొందరిలో ఆల్కాహాలిక్‌ ఫ్యాటీ లివర్‌కు దారి తీస్తోంది. అలవాటు లేని వారిలో అధిక బరువు, మధుమేహం, కొలెస్ట్రాల్‌, థైరాయిడ్‌ సమస్యలతో నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ ముప్పు పెరుగుతోంది. ః  నగరంలో 50 శాతం మందికిపైగా అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారు.

500 రకాల పనులు చేస్తుంది..

కాలేయం జీర్ణ వ్యవస్థకు అనుబంధంగా ఉన్న అతి పెద్ద గ్రంథి. ఇది 500 పైగా ప్రాణాధార విధులను నిర్వర్తిస్తుంది. తినే ఆహారం నుంచి వేసుకునే మందులు సైతం కాలేయం ద్వారానే ప్రయాణిస్తాయి. రోజూ 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేస్తూ కాలేయాన్ని కాపాడుకోవాలి.

డా.ధర్మేష్‌ కపూర్‌, సీనియర్‌ హెపటాలజిస్ట్‌, యశోద ఆసుపత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని