Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Oct 2021 21:45 IST

1. HYD: హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు!
నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం నుంచి ప్రజలు తేరుకోకముందే నగరాన్ని మరో భారీ వర్ష సూచన కలవరపెడుతోంది. భాగ్యనగరంలో ఈ మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని తెలిపింది. సహాయం కోసం కంట్రోల్‌ రూంను సంప్రదించవచ్చని వివరించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Hyderabad : థియేటర్‌ గోడ కూలి.. 50 బైక్‌లు ధ్వంసం

2. MAA Elections: దమ్ముంటే నా ఫ్యామిలీపై కామెంట్‌ చేయండి.. నేనేంటో చూపిస్తా: మంచు విష్ణు

మరి కొన్ని గంటల్లో జరగనున్న సిని‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించేందుకు నటుడు మంచు విష్ణు హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలతో ప్రత్యర్థి ప్యానల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు మద్దతిస్తూ ఇటీవల నాగబాబు చేసిన వ్యాఖ్యలపై విష్ణు కౌంటర్‌ ఇచ్చారు. తన ఫ్యామిలీపై ఎవరైనా కామెంట్లు చేస్తే జీవితంలో క్షమించనని హెచ్చరించారు. ‘పవన్‌కల్యాణ్‌కి కోపం వస్తే వార్‌ వన్‌సైడ్‌ అవుతుంది’ అంటూ నాగబాబు చేసిన ఓ కామెంట్‌పై విష్ణు సెటైర్‌ వేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. TS News: గాయత్రీదేవిగా దర్శనమిస్తోన్న భద్రకాళి అమ్మవారు

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీభద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారు గాయత్రీదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవికి సింహ వాహన సేవ నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, విశేష పూజలు చేశారు. గాయత్రీదేవీ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Brahmotsavam: ఘనంగా మలయప్పస్వామికి సింహ వాహన సేవ

4. AP News: చైనా సమస్య జగన్‌కు ఎందుకు?: పయ్యావుల

ఏపీలో విద్యుత్ సంక్షోభానికి సీఎం జగనే కారణమని పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. రాష్ట్రం సమస్యను ఇతర దేశాలతో పోలుస్తారా అని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘విద్యుత్‌ సంక్షోభంపై ప్రధానికి రాసిన లేఖలో చైనా, యూరప్‌తో ఏపీని పోలుస్తారా?విద్యుత్‌ విషయంలో పొరుగున ఉన్న తెలంగాణతో పోల్చుకోలేదు. తెలంగాణలో విద్యుత్ వ్యవస్థ మెరుగ్గా ఉంటే చైనా సమస్య జగన్‌కు ఎందుకు?  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Anand Mahindra: ఎయిరిండియా టేకోవర్‌పై ఆనంద్‌ మహీంద్రా ఏమన్నారంటే..

ఎయిరిండియా పగ్గాలు మళ్లీ టాటా సన్స్‌ చేతికి వెళ్లడాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా స్వాగతించారు. ఈ విమానయాన సంస్థ నుంచి ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో భారత్‌లో వ్యాపార వాతావరణం పునర్‌వైభవాన్ని సంతరించుకోనుందని అభిప్రాయపడ్డారు. అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థను ప్రభుత్వం వదులుకోవడమే కాకుండా.. ప్రైవేటు రంగంపై ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరిస్తోందని వ్యాఖ్యానించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

'సిప్' చేస్తున్నారా.. ఈ త‌ప్పులు చేయ‌కండి..

6. Corona: మళ్లీ తగ్గిన కొత్త కేసులు.. ఊరటనిస్తోన్న క్రియాశీల కేసులు

దేశంలో కరోనా కేసులు మరోసారి 20 వేల దిగువకు చేరాయి. మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగకపోయినా.. గత కొద్దికాలంగా వ్యాప్తి అదుపులోనే ఉంటుంది. కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. క్రియాశీల కేసులు కూడా 206 రోజుల కనిష్ఠానికి చేరడం ఊరటనిస్తోంది. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 12,69,291 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. IPL 2021: ప్లే ఆఫ్స్‌కి వెళ్లకపోయినా.. అందుకు గర్వంగా ఉంది: రోహిత్‌ శర్మ

ఐపీఎల్-14 సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్  ముంబయి ఇండియన్స్‌  పోరాటం ముగిసింది. సన్‌రైజర్స్‌తో జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో విజయం సాధించినా.. నెట్‌రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో ప్లే ఆఫ్స్‌కి వెళ్లలేకపోయింది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడాడు. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన తమ జట్టు.. ఈ సారి ప్లే ఆఫ్స్‌కి చేరకపోవడం కాస్త నిరాశకు గురిచేసిందన్నాడు. కానీ, గత ఆరేళ్లలో నాలుగు సార్లు విజేతగా నిలవడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* IPL 2021: చెన్నై సూపర్‌ కింగ్స్‌కు అగ్ని పరీక్షే!

8. 17 ఏళ్లుగా అడవిలోనే.. లగ్జరీ కారులో..

కర్ణాటకలోని మంగళూరు జిల్లా సుల్యాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరంతోడ్‌ గ్రామంలోని అద్దేల్‌-నెక్కారే అడవిలో ప్రయాణిస్తుంటే ప్లాస్టిక్‌ కవర్‌ కప్పిన ఓ చిన్న గుడిసె తారసపడుతుంది. దానిలోపల ఆ రోజుల్లోనే లగ్జరీ వాహనంగా పేరొందిన ‘ప్రీమియర్‌ పద్మిని కారు’, ఓ రేడియో, పాత సైకిల్‌ దర్శనమిస్తాయి. అలాగే ఆ గుడిసెలోనే మాసిన గడ్డం, పాత బట్టలు, అరిగిపోయిన చెప్పులతో ఓ వ్యక్తి దర్శనమిస్తాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Gopichand Aaradugula Bullet Review: రివ్యూ: ఆర‌డుగుల బుల్లెట్‌

ఏళ్ల త‌ర‌బ‌డి సెట్స్‌పై మ‌గ్గే సినిమాలు కొన్ని ఉంటాయి. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఎప్పుడో మొద‌లై, ఇంకెప్పుడో అవి ప్రేక్షకుల ముందుకొస్తాయి. అలాంటి చిత్రమే.. ‘ఆర‌డుగుల బుల్లెట్‌’. నాలుగేళ్లుగా ప‌లుసార్లు విడుద‌ల తేదీల్ని మార్చుకున్న ఈ చిత్రం.. ఎట్టకేల‌కు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.  గోపీచంద్ క‌థానాయ‌కుడు కావ‌డం, బి.గోపాల్ ద‌ర్శక‌త్వం వ‌హించ‌డం, వ‌క్కంతం వంశీ, అబ్బూరి ర‌వి, మ‌ణిశ‌ర్మ త‌దిత‌రులు ఈ సినిమాలో భాగం కావ‌డంతో ఎంత ఆల‌స్యమైనా ఒకింత ఆస‌క్తిని రేకెత్తించింది. మ‌రి చిత్రం ఎలా ఉందో చూద్దామా..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

HBD Rajamouli: రాజమౌళి సినిమాల్లో ఈ ప్రత్యేకతలు గమనించారా?

10. Lakhimpur Kheri: పోలీసుల ముందుకు కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్‌

 ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఎట్టకేలకు బయటకొచ్చారు. ఘటన జరిగిన అనంతరం కన్పించకుండా పోయిన ఆయన.. విచారణ నిమిత్తం శనివారం ఉదయం పోలీసుల ఎదుట హాజరయ్యారు. లఖింపుర్‌ ఘటనలో విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆశిష్‌కు సమన్లు జారీ చేశారు. శుక్రవారమే హాజరవ్వాలని ఆదేశించినప్పటికీ ఆయన రాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని