Updated : 14 Oct 2021 13:19 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. MAA Elections: బాలయ్యను కలిశా... చిరంజీవినీ కలుస్తా: మంచు విష్ణు

సినీ పెద్దలందరితో కలిసి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ అభివృద్ధి కోసం పాటుపడతానని నటుడు, ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తనకు మద్దతుగా నిలిచిన నందమూరి బాలకృష్ణను తొలిసారి కలిశారు. తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి గురువారం ఉదయం బాలయ్య ఇంటికి వెళ్లారు. ‘మా’ అభివృద్ధి, శాశ్వత భవన నిర్మాణం వంటి అంశాలపై బాలకృష్ణతో చర్చించారు. భేటీ అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* MAA Elections: ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో అమ్మకే తెలియాలి: హేమ

2. మన్మోహన్ జీ..  మీరు త్వరగా కోలుకోవాలి: మోదీ

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. ఇటీవల అస్వస్థతకు గురైన మన్మోహన్ సింగ్ బుధవారం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన్ను పరామర్శించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ గురువారం ఆసుపత్రికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఈఎస్‌ఈ.. గేట్‌ ఏ పోలికలు? ఏ తేడాలు?  

ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఏటా జాతీయస్థాయిలో రాసే పరీక్షలు...గేట్, ఈఎస్‌ఈ. సాధారణంగా ఎక్కువమంది ఈ రెండు పరీక్షలకూ సిద్ధమవుతుంటారు. ఉమ్మడి ప్రిపరేషన్‌ సాగిస్తుంటారు. ఈ సందర్భంగా వీటిలో మెరుగైన స్కోరు సాధించదలిచిన విద్యార్థులు గేట్, ఈఎస్‌ఈల మధ్య సారూప్యాలూ, భేదాలూ తెలుసుకోవటం చాలా అవసరం. గేట్, ఈఎస్‌ఈ (ప్రిలిమ్స్‌) రెండూ ఫిబ్రవరి నెలలోనే జరగనున్నాయి. ఈ పరీక్షలకు దాదాపుగా నాలుగున్నర నెలల కాలవ్యవధి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Sharannavaratri: మహిషాసుర మర్దినిగా కనకదుర్గమ్మ అభయం

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఇవాళ ఎనిమిదో రోజు కావడంతో అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసుర మర్దినిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అష్ట భుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి. రేపటితో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Tirumala Brahmotsavam: సర్వభూపాల వాహనంపై వేంకటాచలపతి

5. AP News: ఏపీలో అప్పులు ఫుల్‌.. అభివృద్ధి నిల్‌: యనమల

ఏపీలో అప్పులు ఫుల్‌.. అభివృద్ధి నిల్‌ అని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అన్నివిధాలా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు రావట్లేదని విచారం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడిలో తెదేపా నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో యనమల పాల్గొని మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెదేపా విజయం ఖాయమని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. India Corona: మళ్లీ పెరిగిన కేసులు..తాజాగా నమోదైన కేసులు ఎన్నంటే..?

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 18 వేలకు పైగా కేసులు, 200కు పైగా మరణాలు సంభవించాయి. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ ఈ గణాంకాలను వెల్లడించింది. బుధవారం 13,01,083 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,987 మందికి పాజిటివ్‌గా తేలింది. అంతక్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 16 శాతం పెరుగుదల కనిపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. IPL 2021: అంతదూరం వెళ్తుందని అస్సలు ఊహించలేదు: రాహుల్‌ త్రిపాఠి

దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ చివరి బంతి వరకు వెళ్తుందని అస్సలు ఊహించలేదని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ త్రిపాఠి అన్నాడు. ఆఖరి రెండు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన స్థితిలో అతడు ‌(12; 11 బంతుల్లో 1x6) సిక్సర్‌తో కోల్‌కతాను గెలిపించాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ఉత్కంఠభరిత పరిస్థితుల్లో జట్టును గెలిపించడం గొప్పగా ఉందన్నాడు. అయితే, సునాయాసంగా గెలుస్తామనుకున్న మ్యాచ్‌ అంత దూరం వెళ్తుందని ఊహించలేకపోయానన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ జట్టులో శార్దూల్‌ ఎంపికపై నెటిజెన్ల మిశ్రమ స్పందన

8. Crime News: బాత్‌రూంలో బంధించి యువతిపై అత్యాచారం

దిల్లీలో ఓ యువతిని బాత్‌రూంలో బంధించి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నానం చేసేందుకు వెళ్తుండగా చొరబడి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నిందితులిద్దరూ బాధితురాలి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు. ఘటన అనంతరం యువతిని వారిద్దరూ బెదిరించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టి, అక్కడి నుంచి పరారయ్యారు. విషయాన్ని బాధితురాలు కుటుంబసభ్యులకు చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. UP Politics: ఉత్తర్‌ ప్రదేశ్‌లో వేడెక్కిన రాజకీయం 

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉత్తర్‌ ప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు పదునెక్కుతున్నాయి. లఖింపురి ఖేరి ఘటన నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా యూపీలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆమె రైతుల సమస్యలను లేవనెత్తిన విధానం, పోరాడిన తీరు పార్టీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజానీకాన్నీ బాగా ఆకట్టుకుందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Bheemla Nayak: పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ కాస్త వెయిట్‌ చేయండి!

స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ కోసం పవర్‌స్టార్‌ అభిమానులు కాస్త ఎదురుచూడాల్సి ఉంది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘భీమ్లానాయక్‌’ నుంచి రెండో పాట విడుదలను తెలియజేస్తూ చిత్రబృందం స్పెషల్‌ ప్రోమో షేర్‌ చేసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ‘అంత ఇష్టం’ అంటూ సాగే ఓ పాట ప్రోమోను గురువారం సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Manchi Rojulochaie: సంతోష్‌.. ఆనందానికి అడ్రస్‌ ఇతనే..!


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని