Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Oct 2021 13:12 IST

1. Nawab Malik: ఒక్కసారి వాంఖడే ఫోన్‌ పరిశీలిస్తే.. అన్నింటి మీదా స్పష్టత వస్తుంది..!

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్ ఖాన్‌ అరెస్టు కంటే మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చేస్తోన్న ఆరోపణలే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆర్యన్‌ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై గత కొద్ది రోజులుగా ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా పలు ఫొటోలు, లేఖలు విడుదల చేస్తున్నారు. బుధవారం మరోసారి తన ఆరోపణల్ని కొనసాగించారు. క్రూయిజ్ నౌక డ్రగ్స్‌ కేసులు దర్యాప్తును నిర్వీర్యం చేసేందుకు నేను ప్రయత్నిస్తున్నానని ఆరోపిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. AP High Court: తితిదే బోర్డులో నేరచరిత్ర ఉన్నవారి నియామకంపై హైకోర్టు ఆగ్రహం

తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) బోర్డులో నేర చరిత్ర ఉన్నవారి నియామకంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తితిదే పాలకమండలి నియామకాన్ని సవాల్‌ చేస్తూ భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది అశ్వినికుమార్‌ వాదనలు వినిపించారు. ఎంసీఐ మాజీ ఛైర్మన్‌ డా.కేతన్‌ దేశాయ్‌ నియామకంపై అశ్వినికుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP News: ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు

3. Pegasus: ‘పెగాసస్‌’పై విచారణకు నిపుణుల కమిటీ.. సుప్రీం వెల్లడి

దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌ స్పైవేర్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి. రవీంద్రన్‌ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని పేర్కొంది. నిపుణుల కమిటీ పనితీరును తామే పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. PAN: పాన్‌తో జాగ్రత్త.. మీకు ఐటీశాఖ నోటీసులు రావచ్చు..! 

రెక్కాడితే గానీ డొక్కాడని ఓ రిక్షా కార్మికుడికి రూ.3 కోట్లు చెల్లించాలంటూ ఇటీవల ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. తాను రోజుకు రూ.500 సంపాదించడమే గగనమని.. ఇంత మొత్తానికి పన్ను నోటీసు రావడమేంటని ముక్కున వేలేసుకోవడం ఆ బడుగు జీవి వంతైంది. అతని పేరిట గుర్తు తెలియని వ్యక్తులు ఒక్క ఏడాదిలో దాదాపు రూ.43 కోట్ల వ్యాపారం చేసినట్లు తేలింది. అంతకుముందు మూడు సంవత్సరాల క్రితం ప్రముఖ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే సతీమణి చేతనకు సైతం ఇటువంటి అనుభవమే ఎదురైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. AP News: చంద్రబాబు సంగతి తెలిసే అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు: విజయసాయి

తెదేపా అధినేత చంద్రబాబు సంగతి తెలిసే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యా్ఖ్యానించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దిల్లీ పర్యటనపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘‘చంద్రబాబు ఎందుకు దిల్లీ వచ్చారో చెప్పాలి. దిల్లీలో వ్యవస్థలను ప్రభావితం చేసేందుకు వచ్చారా?ఏపీ పరువు తీసేందుకే దిల్లీ వచ్చారా?పట్టాభి తిట్లను సమర్థిస్తున్నారా?ఏపీలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు లేవు’’ అని విజయసాయిరెడ్డి అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Pawan Kalyan: మాదకద్రవ్యాల హబ్‌గా ఏపీ: పవన్‌ కల్యాణ్‌

6. హైప‌ర్ ఛార్జ‌ర్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న `ఓలా ఎల‌క్ట్రిక్‌`

`ఓలా` కంపెనీ త‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను భార‌త్‌లో త్వ‌ర‌లో భారీగా అమ్మ‌కాలు సాగించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఇప్ప‌టికే బుకింగ్‌లు కూడా భారీగా ప్రారంభ‌మ‌య్యాయి. టెస్ట్ రైడ్ త‌ర్వాత త్వ‌ర‌లో స్కూట‌ర్‌లు హోమ్ డెలివ‌రీలు అవుతాయి. అయితే ఇది పూర్తిగా బ్యాట‌రీతో న‌డిచే స్కూట‌ర్ కాబ‌ట్టి దీనికి సంబంధించి త్వ‌ర‌లో హైప‌ర్ ఛార్జ‌ర్‌ల‌ను కూడా విడుద‌ల చేయ‌డానికి `ఓలా` ఎల‌క్ట్రిక్ కంపెనీ స‌న్న‌హాల్లో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. Corona Virus: కొవిడ్‌తో మెదడుకు అధిక ముప్పు

కొవిడ్‌ కారణంగా మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయన్నది ఇప్పటికీ పూర్తిగా అంతుచిక్కని విషయమే! అయితే- కరోనా కారణంగా కొందరు బాధితుల్లో అరుదైన నాడీ సంబంధ సమస్యలు తలెత్తుతున్నట్టు పలు నివేదికలు వెల్లడించాయి. వైరస్‌కు విరుగుడుగా పరిశోధకులు అభివృద్ధి చేసిన టీకాలతోనూ ఇలాంటి దుష్ప్రభావాలే ఉంటున్నట్టు నిపుణులు తేల్చారు. దీంతో ఈ అంశంపై ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధన సాగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* India Corona: 13 లక్షల పరీక్షలు చేస్తే.. ఎన్ని కేసులు వచ్చాయంటే..?

8. Oscar 2022: ‘కూళాంగల్‌’ సింపుల్‌గా తీస్తే.. ఆస్కార్‌ పోటీకి వెళ్లింది!

ఆస్కార్‌.. యావత్‌ సినీ ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు. ఈ అవార్డుని స్వీకరించాలని సినీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు కలలు కంటారు. ఈసారి మన భారతదేశం తరఫున ఆస్కార్-2022 పోటీలో నిలవడానికి తమిళ చిత్రం ‘కూళాంగల్‌’ ఎంపికైన సంగతి తెలిసిందే. హిందీలో విడుదలైన ‘సర్దార్‌ ఉద్దామ్‌’, ‘షేర్నీ’ చిత్రాలను వెనక్కి నెట్టి ‘కూళాంగల్’ దేశం తరఫున ఆస్కార్‌కు ఇండియా నుంచి అధికారికంగా ఎంట్రీ సాధించింది. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పీఎస్‌ వినోద్‌రాజ్‌కు.. దర్శకుడిగా ఇదే తొలి సినిమా కావడం మరో విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. IND vs PAK: పాక్‌ మాజీ పేసర్‌కు హర్భజన్‌ సింగ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 దశలో భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ అయితే ముగిసింది కానీ.. ఇరు దేశాల మాజీ ఆటగాళ్ల మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌, పాక్‌ మాజీ పేసర్‌ మహమ్మద్‌ అమిర్ ట్విటర్‌ వేదికగా పరస్పరం ట్వీట్ల దాడి చేసుకున్నారు. దుబాయ్‌ వేదికగా గత ఆదివారం భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

IND vs PAK:  ఆ వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెబుతున్నా: వకార్‌

10. బ్రిటన్‌ మ్యూజియాల్లో వెలకట్టలేని భారత కళాఖండాలు!

భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటన్‌ ఇక్కడి నుంచి ఎంతో విలువైన సంపదను తమ దేశానికి దోచుకెళ్లింది. ఈ విషయంలో మనం సాధారణంగా బ్రిటన్‌ రాణి కిరీటంలో ఉన్న కోహినూర్‌ వజ్రం గురించే మాట్లాడుకుంటాం. కానీ.. భారతీయ సంస్కృతి, చరిత్రను తెలియజేసే ఎన్నో వెలకట్టలేని కళాఖండాలను మనదేశం నుంచి ఎత్తుకెళ్లింది. అయితే వాటిలో కొన్ని భారత చక్రవర్తులే బహుకరించగా వాటిని బ్రిటన్‌కు తరలించారు. అలా అనేక కళాఖండాలు ఇప్పటికీ బ్రిటన్‌లోని పలు మ్యూజియాల్లో దర్శనమిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని