India Corona: 13 లక్షల పరీక్షలు చేస్తే.. ఎన్ని కేసులు వచ్చాయంటే..?

తాజా వార్తలు

Updated : 27/10/2021 12:51 IST

India Corona: 13 లక్షల పరీక్షలు చేస్తే.. ఎన్ని కేసులు వచ్చాయంటే..?

భారీగా నమోదైన మృతుల సంఖ్య

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే కొత్త కేసులు తగ్గినట్టే తగ్గి, పెరుగుతున్నాయి. ముందురోజు ఎనిమిది నెలల కనిష్ఠానికి తగ్గిన కేసులు.. 24 గంటల వ్యవధిలో స్వల్పంగా పెరిగాయి. మృతుల సంఖ్య మాత్రం 500పైనే నమోదైంది. బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ ఈ గణాంకాలను వెలువరించింది. 

మంగళవారం 13,05,962 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 13,451 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. 14,021 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 3.42 కోట్లకు చేరగా.. 3.35 కోట్ల(98.19 శాతం) మంది మహమ్మారిని జయించారు. వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో గత కొంతకాలంగా క్రియాశీల కేసులు అదుపులో ఉంటున్నాయి. ప్రస్తుతం 1,62,661(0.48 శాతం) మంది వైరస్‌తో బాధపడుతున్నారు. నిన్న మృతుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించింది. 585 మరణాలు నమోదయ్యాయి. అందులో 482 కేరళవే. మొత్తంగా 4,55,653 మంది కరోనా కాటుకు బలయ్యారు. 

ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. ఇప్పటివరకు 103 కోట్లకుపైగా కరోనా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 55,89,124 మంది టీకా వేయించుకున్నారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని