Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 15 Apr 2023 17:01 IST

1. భారాస దెబ్బకు ఉక్కు ప్రైవేటీకరణ నిలిచిపోయిందనేది అవాస్తవం: బొత్స

విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడి వాస్తవమని.. ఆ దాడిని స్వయంగా ఆయనే చేయించుకున్నారనే భావన కల్పిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ రిపోర్టును కొన్ని వార్తా సంస్థలు వక్రీకరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి అలిపిరి వద్ద తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నక్సల్స్ దాడి చేశారని.. రాజకీయ లబ్ధి కోసం ఆయనే ఆ దాడి చేయించుకున్నారా? అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆస్పత్రి ఘటన.. సిబ్బంది ఉండగా లాక్కెళ్లాల్సిన అవసరం ఏముంది?: సూపరింటెండెంట్‌

నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని ఈడ్చుకుంటూ వెళ్లిన ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్ స్పందించారు. ఆస్పత్రిలో వీల్‌ఛైర్, స్ట్రెచర్స్‌ కొరత లేదని స్పష్టం చేశారు. సిబ్బంది ఉండగా రోగిని లాక్కెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ మేరకు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వివేకా హత్య కేసు.. ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్‌ యత్నించాడు : సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలు చెరిపివేసేందుకు కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి అనుచరుడు ఉదయ్‌కుమార్‌ రెడ్డి ప్రయత్నించాడని సీబీఐ వెల్లడించింది. ఉదయ్‌ రిమాండ్‌ రిపోర్టులో పలు కీలక అంశాలను సీబీఐ పొందుపరిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి: కేంద్రానికి హరీశ్‌రావు పోస్టుకార్డు

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతూ కేంద్రానికి తెలంగాణ మంత్రి హరీశ్ రావు పోస్టుకార్డు రాశారు. ఉపాధి హామీపై పోస్టుకార్డుల ఉద్యమాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వానికి హరీశ్ లేఖ రాశారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేయాలని చూస్తోందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అలా చేస్తే.. కమలానికి 20-25 సీట్లు గల్లంతే: మాజీ సీఎం వార్నింగ్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Assembly elections) దగ్గరపడుతున్న వేళ.. భాజపా (BJP)లో టికెట్ల రగడ నానాటికీ ముదురుతోంది. అటు మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌ (Jagadish Shettar) అభ్యర్థిత్వంపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో అసమ్మతిని పెంచుతోంది. ఈ నేపథ్యంలో శెట్టర్‌.. మరోసారి భాజపా హైకమాండ్‌కు హెచ్చరికలు చేశారు. తనకు టికెట్‌ ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో పార్టీ కనీసం 20-25 సీట్లను కోల్పోవాల్సి వస్తుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గిల్‌.. నువ్వు ధోనీ నుంచి నేర్చుకోవాలి: మంజ్రేకర్

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో (IPL 2023) గుజరాత్‌ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) అదరగొట్టేస్తున్నాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు అర్ధశతకాలతో 183 పరుగులు చేశాడు. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ (PBKS vs GT) 49 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. కానీ, మిడిల్‌ ఓవర్లలో మాత్రం నెమ్మదించాడు. దీంతో 154 పరుగుల లక్ష్య ఛేదన చివరి ఓవర్‌ వరకూ వెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జియో సినిమాకు ఇక డబ్బులు.. ఐపీఎల్‌ మాత్రం ఫ్రీనే!

ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌ల ప్రసారాలతో ఆదరణ పొందిన జియో సినిమా (Jio cinema)ను  అతిపెద్ద స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా మార్చేందుకు రిలయన్స్‌ (Reliance) సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 100కు పైగా సినిమాలు, టీవీ సిరీస్‌లను తన జియో సినిమా యాప్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. తద్వారా నెట్‌ఫ్లిక్స్‌, వాల్ట్‌ డిస్నీ వంటి అంతర్జాతీయ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లతో పోటీ పడాలని భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మోదీకి రూ.1000 కోట్లు ఇచ్చానంటే.. ఆయన్ను అరెస్టు చేస్తారా?: కేజ్రీవాల్‌

మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సమన్లు జారీ చేయడంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అవకతవకలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినా దర్యాప్తు సంస్థలు కోర్టుల్లో అబద్ధాలు చెప్తున్నాయని, అరెస్టు చేసినవారిని హింసిస్తున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఉపశమనం!

మహారాష్ట్ర (Maharashtra)లో నమోదైన ఓ పరువునష్టం కేసు (Defamation Case)లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఉపశమనం లభించింది. విచారణ క్రమంలో ప్రత్యక్ష హాజరు నుంచి కోర్టు ఆయనకు శాశ్వత మినహాయింపు ఇచ్చింది. తన న్యాయవాది ద్వారా రాహుల్‌ ఈ మేరకు దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించిన భివండీ ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లక్ష్మీకాంత్ సీ వాడికర్‌.. శాశ్వత మినహాయింపునకు రాహుల్‌ అర్హుడని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఏడాది పాటు ఆఫీసుకెళ్లకుండానే జీతం.. కంపెనీ లక్కీ డ్రాలో ఉద్యోగికి బంపరాఫర్‌

ఉద్యోగులకు కంపెనీ పది రోజుల పాటు సెలవులు ఇస్తేనే ఎగిరి గంతేస్తారు. అలాంటిది ఓ కంపెనీ తన ఉద్యోగికి ఏకంగా 365 రోజులు వేతనంతో కూడిన సెలవులను ఇచ్చింది. దీంతో ఏడాది పాటు ఎలాంటి విధులు నిర్వహించకుండానే అతడు నెలనెలా జీతం పొందే అవకాశం లభించింది. అదెలా అనుకుంటున్నారా..? అదంతా కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రా పుణ్యమే! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని