Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 17 Apr 2023 17:06 IST

1. వారిద్దరి నుంచి ప్రమాదం పొంచి ఉంది: దస్తగిరి

ముఖ్యమంత్రి జగన్‌, ఎంపీ అవినాష్‌ రెడ్డిల నుంచి ఇప్పటికీ తనకు ప్రమాదం పొంచి ఉందని మాజీ ఎంపీ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి అన్నారు. వివేకా కుమార్తె సునీత, సీబీఐ నుంచి తాను రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ఎర్రగుంట్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను అప్రూవర్‌గా మారడాన్ని చాలా మంది విమర్శిస్తున్నారు. అప్రూవర్‌గా మారేవేళ అవినాష్‌ లాంటి వాళ్లు ఎందుకు ప్రశ్నించలేదు?’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏం చేద్దాం?.. వైకాపా ముఖ్యనేతలతో సీఎం జగన్‌ అత్యవసర భేటీ

వైకాపా ముఖ్యనేతలతో సీఎం జగన్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ భేటీకి తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. సీఎం అనంతపురం పర్యటన, అధికారిక సమీక్షలు రద్దుతో పాటు మాజీ మంత్రి వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ ముందు హాజరు కానుండటం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భాజపాకు షాక్‌.. కాంగ్రెస్ గూటికి శెట్టర్‌

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కర్ణాటక( Karnataka)రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ క్రమంలో టికెట్ల కేటాయింపు భాజపాకు తలనొప్పిగా మారింది. టికెట్‌ విషయంలో తీవ్ర అసంతృప్తికి గురైన కమలం పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌(Jagadish Shettar)సోమవారం కాంగ్రెస్‌(Congress)లో చేరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఓ తండ్రిగా.. అర్జున్‌కు సచిన్‌ ప్రత్యేక సందేశం

ఐపీఎల్‌ చరిత్రలో (IPL) అరుదైన రికార్డును సచిన్‌ తెందూల్కర్ - అర్జున్‌ తెందూల్కర్‌ (Sachin - Arjun) సొంతం చేసుకున్నారు. సోదరులు ఆడినప్పటికీ.. ఇలా తండ్రీకుమారులిద్దరూ ఓ లీగ్‌లో ఆడటం తొలిసారి. కోల్‌కతాపై అరంగేట్రం చేసిన అర్జున్ తెందూల్కర్‌కు కెప్టెన్‌ సూర్యకుమార్‌ తొలి ఓవర్‌నే బంతినిచ్చాడు. రెండు ఓవర్లు వేసిన అర్జున్ వికెట్‌ లేకుండా 17 పరుగులు ఇచ్చాడు. విభిన్నమైన రనప్‌తో లైన్‌ లెంగ్త్‌కు కట్టుబడి బంతులను సంధించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎవరీ గుడ్డూ..?అతీక్‌ సోదరుడి చివరి మాట అతడి పేరే..!

హత్యకు ఒక్క క్షణం ముందు గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ సోదరుడు అష్రాఫ్‌ తమ ప్రధాన బాంబ్‌స్పెషలిస్టు గురించి ఏదో ప్రస్తావిస్తూ.. ‘‘అసలు విషయం ఏమిటంటే.. గుడ్డూముస్లిం’’ అని ఏదో చెప్పబోయాడు. అదే సమయంలో అత్యంత సమీపం నుంచి హంతకులు అతీక్‌ను కాల్చేశారు. అష్రాఫ్‌ ఆ షాక్‌ నుంచి తేరుకొనేలోపే.. అతడిపై కూడా తూటాల వర్షం కురిసింది. దీంతో అతీక్‌ సోదరులిద్దరూ అచేతనంగా నేలపై పడిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తుర్కియే తుపాకులతో అతీక్‌ హత్య.. రెండ్రోజుల ముందే మాటు వేసి..!

ఉత్తరప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌(Atiq Ahmed), అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ను చంపిన నిందితులు అత్యాధునిక ఆయుధాలను వాడినట్లు పోలీసులు గుర్తించారు. హంతకులు తుర్కియేకు చెందిన ‘టిసాస్‌’ కంపెనీ తయారు చేసిన సెమీ-ఆటోమేటిక్‌ ఆయుధమైన ‘జిగాన’(Zigana) పిస్తోల్‌ను వాడినట్లు సమాచారం. తుర్కియేలో పాలిమర్‌ ఫ్రేమ్‌తో తయారైన తొలి పిస్తోల్‌ ఇదే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎంఎస్‌ ధోనీ.. ఇలాంటి కెప్టెన్‌ భవిష్యత్తులో కష్టమే: గావస్కర్‌

భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni)పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించారు. ధోనీ లాంటి కెప్టెన్‌ భవిష్యత్తులో ఉండరని అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌ సీజన్లలో (IPL) చెన్నై సూపర్‌కింగ్స్‌ (CSK) సారథిగా.. జట్టును కఠినమైన పరిస్థితుల నుంచి గట్టెక్కిచ్చిన తీరును కొనియాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ప్రభుత్వ కార్యక్రమంలో దారుణం.. బాధ్యులెవరు?: ఉద్ధవ్‌ విమర్శ

మహారాష్ట్ర నవీ ముంబయిలోని ఖర్గర్‌లో నిర్వహించిన మహారాష్ట్ర భూషణ్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో దుర్ఘటన చోటు చేసుకుంది. కార్యక్రమానికి హాజరైన వారిలో 11 మంది వడదెబ్బ తగిలి మృతి చెందారు.. మిగిలిన 49 మందిని ఎమ్‌జీఎమ్‌ కౌముతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సోమవారం బాధితులను కలిసి పరామర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మోదీజీ.. మీ ట్రిక్స్ నాకు తెలుసు : ప్రధాని ప్రసంగంపై గహ్లోత్‌ వ్యాఖ్యలు

తాను సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఎవరి మాటల వెనక ఏ మర్మముందో గ్రహించగలనని రాజస్థాన్‌(Rajasthan)ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌(Ashok Gehlot) వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ(PM Modi) పొగడ్తలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 

10. బెంగళూరు Vs చెన్నై.. టాప్‌ - 10 మోస్ట్‌ ఇంట్రెస్టింగ్‌ మ్యాచ్‌లు!

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) - రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్‌ అంటే ఎప్పుడూ ఇంట్రెస్టింగే. బెంగళూరు జట్టుకు కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌ అయినా సరే.. ఇప్పటికీ అభిమానులకు మాత్రం కింగ్‌ కోహ్లీ (Virat Kohli)నే సారథి. ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఢీకొట్టాలంటే  బెంగళూరు చెమటోడ్చాల్సిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని