Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 14 Apr 2023 21:03 IST

1. దేశమంతా దళిత బంధు ఇచ్చే రోజు వస్తుంది: సీఎం కేసీఆర్‌

దేశమంతా ఏటా 25లక్షల కుటుంబాలకు దళితబంధు ఇచ్చే రోజు వస్తుందని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నడిబొడ్డున ఏర్పాటు చేసిన 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆయన మనువడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ముందుకే.. కేంద్రం క్లారిటీ

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపేది లేదని కేంద్రం స్పష్టంచేసింది. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిలుపుదల చేసినట్లు వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టంచేసింది. స్టీల్‌ప్లాంట్‌ పనితీరు మెరుగుకు ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ తన వంతు కృషి చేస్తున్నాయంటూ ఈ మేరకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టంచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఐపీఎల్‌ను జియో సినిమాలో డిజిటల్‌గా చూడాలి అనడానికి 5 కారణాలు!

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ కార్నివాల్‌ మళ్లీ వచ్చేసింది. దేశం మొత్తం టాటా ఐపీఎల్‌ను ఓ పండగలా జరుపుకొంటోంది. మూడు సీజన్ల గ్యాప్‌ తర్వాత తిరిగి తన పాత ఫార్మాట్‌లో అలరిస్తున్న 2023 ఐపీఎల్‌లో హైలైట్‌ జియో సినిమా అనే చెప్పాలి. సరికొత్త ఫీచర్లు, అదిరిపోయే నాణ్యతతో జియో సినిమాలో ఐపీఎల్‌ను వీక్షించొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్‌.. రికార్డు స్థాయికి బంగారం ధర

దేశంలో బంగారం ధర మరోసారి పెరిగింది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్‌ ఏర్పడడంతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో ఎప్పుడూ లేని స్థాయిలో స్పాట్‌ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్ల స్వచ్ఛత) బంగారం ధర రూ.480 పెరిగి రూ.61,780కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో రూ.61,300 వద్ద ముగిసింది. వెండి సైతం కిలో రూ.410 పెరిగి రూ.77,580కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దిల్లీ మద్యం కుంభకోణం.. కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు

దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు సీబీఐ (CBI) నోటీసులు జారీ చేసింది. ఆదివారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. విచారణలో భాగంగా.. దిల్లీ మద్యం విధానంపై సీబీఐ కేజ్రీవాల్‌ను ప్రశ్నించనుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురిని సీబీఐ అరెస్టు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమిత్ షా బెంగాల్‌ పర్యటన వేళ కలకలం.. కారులో 3400 డిటోనేటర్లు..!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన వేళ.. పశ్చిమ బెంగాల్‌లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమవడం కలకలం రేపుతోంది. బీర్‌భూమ్‌ జిల్లాలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ కారులో 3400 డిటోనేటర్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం బీర్‌భూమ్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్‌ గాంధీ.. వీడియో

లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శుక్రవారం ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. దిల్లీలోని 12- తుగ్లక్‌లేన్‌లో అధికార బంగ్లా నుంచి ఆయనకు చెందిన వస్తువులను డీసీఎం వాహనాల్లో తరలించారు. ఇందులో భాగంగా ఆయన ఇంటి వద్ద రెండు డీసీఎంలు ఉంచారు. ప్రభుత్వ బంగ్లాను విడిచి వెళ్లాల్సి రావడంతో రాహుల్‌ అనేక ఇళ్లు చూసినప్పటికీ.. 10 జన్‌పథ్‌లోని తన తల్లి, కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ నివాసంలో ఆమెతోనే కలిసి ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘షారుక్‌.. రాజకీయ నేతలకు మీ సలహా ఏంటి?’: నటుడిని ప్రశ్నించిన రాహుల్‌ గాంధీ

బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan ), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi )కి మధ్య జరిగిన ఓ సంభాషణ ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘రాజకీయ నాయకులకు మీరిచ్చే సలహా ఏంటి..?’ అంటూ రాహుల్‌ ఆయన్ను ప్రశ్నించారు. 2008లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా షారుక్‌ ఈ ప్రశ్న ఎదురైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రష్యా దురాక్రమణపై వ్యాసం.. వికీపీడియాకు రూ.20లక్షల ఫైన్‌

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దురాక్రమణకు సంబంధించిన విషయాలను అక్కడి ప్రభుత్వం ప్రజలకు తెలియనీయకుండా ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధానికి సంబంధించి రష్యా వ్యతిరేక, విమర్శనాత్మక కథనాలపై పుతిన్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో వికీపీడియాకు మాస్కో న్యాయస్థానం భారీ జరిమానా విధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 2024లో భాజపాకు ఓటేస్తే విధ్వంసం కొనితెచ్చుకున్నట్లే: నీతీశ్‌

భాజపా నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుపై జేడీయూ నేత, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌  ఘాటు విమర్శలు చేశారు. 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేస్తే విధ్వంసాన్ని కొని తెచ్చుకున్నట్లేనని చెప్పారు. ప్రస్తుతం భాజపాకు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యం కోసం తాను పనిచేస్తున్నట్లు చెప్పారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా జేడీయూ కార్యాలయంలో ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి శుక్రవారం మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని