ఐపీఎల్‌ను జియో సినిమాలో డిజిటల్‌గా చూడాలి అనడానికి 5 కారణాలు!

ప్రకటన: ఐపీఎల్‌ 2023ని జియో సినిమా డిజిటల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. 4కె నాణ్యత, హైప్‌ ఫీచర్‌.. లాంటి ఐదు కీలకమైన ఫీచర్లు జియో సినిమాలో ఉన్నాయి.

Updated : 14 Apr 2023 17:25 IST

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ కార్నివాల్‌ మళ్లీ వచ్చేసింది. దేశం మొత్తం టాటా ఐపీఎల్‌ను ఓ పండగలా జరుపుకొంటోంది. మూడు సీజన్ల గ్యాప్‌ తర్వాత తిరిగి తన పాత ఫార్మాట్‌లో అలరిస్తున్న 2023 ఐపీఎల్‌లో హైలైట్‌ జియో సినిమా అనే చెప్పాలి. సరికొత్త ఫీచర్లు, అదిరిపోయే నాణ్యతతో జియో సినిమాలో ఐపీఎల్‌ను వీక్షించొచ్చు.

కొత్త సీజన్‌ కవరేజీలో భాగంగా తొలి వారం జియో సినిమా అదిరిపోయే రికార్డులను నమోదు చేసింది. తొలి వారాంతంలో టోర్నీ స్ట్రీమింగ్‌కు రికార్డు స్థాయిలో 147 కోట్ల వీడియో వ్యూస్‌ వచ్చాయి. ఈ నెంబర్లు మొత్తంగా టాటా ఐపీఎల్‌ ఓటీటీ వ్యూస్‌లో అత్యధికం. అంతేకాదు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022 వ్యూస్‌ కంటే ఈ ఐపీఎల్ వీక్షణలే ఎక్కువ.

టాటా ఐపీఎల్‌ను జియో సినిమాలో ఇంతలా ప్రేక్షకులు ఎందుకు వీక్షిస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ ఐదు అంశాలు చదవండి.. మీకే అర్థమైపోతుంది. 

4K నాణ్యత: జియో సినిమాలో టాటా ఐపీఎల్‌ను 4కె నాణ్యతతో వీక్షించొచ్చు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఇలాంటి నాణ్యత ఉన్న స్ట్రీమింగ్‌ ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీని కోసం వినియోగదారుల డివైజ్‌/ సిస్టమ్స్‌ 4కెకి సపోర్ట్‌ చేయాలి.. అలాగే జియో సినిమా యాప్‌ ఉండాలి. 

అదిరిపోయే ‘హైప్‌’: జియో సినిమా యాప్‌లో ‘హైప్‌’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇటీవల జరిగిన SA20, TATA WPLలో ఈ ఫీచర్‌ను పరిశీలించారు. ఇప్పుడు టాటా ఐపీఎల్‌లో ఈ ఫీచర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘హైప్‌’ ఫీచర్‌తో మ్యాచ్‌ను చూస్తుండగానే స్కోరింగ్‌ రేట్స్‌, బ్యాటర్ల స్కోరింగ్‌ ఏరియాలు, బౌలర్ల హీట్‌ మ్యాప్స్‌, వాగన్‌ వీల్స్‌తోపాటు ఇతర గణాంకాలను చూసుకోవచ్చు. దీంతోపాటు లీన్‌ బ్యాక్‌, లీన్‌ ఫార్వర్డ్‌ ఆప్షన్లు.. వినియోగదారుడికి మంచి వీక్షణ అనుభూతినిస్తాయి. 

మల్టీ కెమెరా: క్రికెట్‌ మ్యాచ్‌ను టెలీకాస్టర్‌ చూపించిన యాంగిల్స్‌లోనే చూస్తుంటాం. అయితే జియో సినిమాలో మల్టీ కెమెరా ఫీచర్‌ ఉంది. లైవ్‌లో మ్యాచ్‌ను వివిధ కెమెరా యాంగిల్స్‌లో వీక్షించొచ్చు. మెయిన్‌ కెమెరా, కేబుల్‌ కెమెరా, బర్డ్స్‌ ఐ కెమెరా, స్టంప్‌ కెమెరా, బ్యాటర్‌ కెమెరా.. ఇలా రకరకాల కెమెరాల నుంచి మ్యాచ్‌ వీక్షించొచ్చు. సూర్య కుమార్‌ యాదవ్‌ 360 డిగ్రీల షాట్‌ని వివిధ యాంగిల్స్‌లో చూస్తే, మహేంద్ర సింగ్‌ ధోనీ హెలికాప్టర్‌ షాట్‌ను వివిధ రకాల కెమెరాల్లో చూస్తే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. 

12 భాషల్లో... : క్రికెట్‌ను అందులోనూ టాటా ఐపీఎల్‌ను మీ సొంత భాషలో చూసే అవకాశం వస్తే.. సూపర్‌ ఆప్షన్‌ కదా. ఇప్పుడు జియో సినిమాలో టాటా ఐపీఎల్‌ను 12 భాషల్లో చూడొచ్చు. ఇంగ్లిష్‌, హిందీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బెంగాళీ, భోజ్‌పురి, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషల్లో కామెంటరీని వింటూ మ్యాచ్‌ను వీక్షించొచ్చు. దీంతోపాటు ఇన్‌సైడర్స్‌ ఫీడ్‌, హ్యాంగవుట్‌ ఫీడ్‌, ఫాంటసీ ఫీడ్‌, ఫ్యాన్‌జోన్‌ ఫీడ్‌ లాంటి 16 ఫీడ్స్‌లో మ్యాచ్‌ను చూడొచ్చు. జియో సినిమాలో టాటా ఐపీఎల్‌ ఛాంపియన్స్‌, లెజెండ్స్‌తో ఓ ఎలైట్‌ క్లబ్‌ కూడా ఉంది. అందులో సురేశ్‌ రైనా, క్రిస్‌ గేల్‌, ఏబీ డివిలియర్స్‌, అనిల్‌ కుంబ్లే, రాబిన్‌ ఉతప్ప, ఆర్పీ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, ఇయాన్‌ మోర్గాన్‌, గ్రేమ్‌ స్మిత్‌, స్కాట్‌ స్టైరిస్‌ లాంటి మాజీ స్టార్‌ క్రికెటర్లు ఉన్నారు.

అందరికీ ఉచితం: ఇన్ని అదిరిపోయే ఫీచర్లు అందిస్తున్న జియో సినిమా వీక్షకులకు పూర్తిగా ఉచితం. జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌.. ఇలా అన్ని నెట్‌వర్క్‌లకు జియో సినిమా సర్వీసు ఉచితంగా అందిస్తున్నారు. టాటా ఐపీఎల్‌ను జియో సినిమాలో చూడటం తొలిసారి అయితే.. ఆ అనుభూతి ఇంకా బాగుంటుంది. ఈ సర్వీసు పూర్తి ఉచితంగా లభించడం మంచి డీల్‌ అని కూడా చెబుతోంది.

జియో సినిమా వెబ్‌సైట్‌ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని