Rahul Gandhi: ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్‌ గాంధీ.. వీడియో

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul gandhi) ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. ఆయన లగేజీని డీసీఎం వాహనాల్లో తరలించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Published : 14 Apr 2023 20:07 IST

దిల్లీ: దిల్లీ: లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) శుక్రవారం ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. దిల్లీలోని 12- తుగ్లక్‌లేన్‌లో అధికార బంగ్లా నుంచి ఆయనకు చెందిన వస్తువులను డీసీఎం వాహనాల్లో తరలించారు. ఇందులో భాగంగా ఆయన ఇంటి వద్ద రెండు డీసీఎంలు ఉంచారు. ప్రభుత్వ బంగ్లాను విడిచి వెళ్లాల్సి రావడంతో రాహుల్‌ అనేక ఇళ్లు చూసినప్పటికీ.. 10 జన్‌పథ్‌లోని తన తల్లి, కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ నివాసంలో ఆమెతోనే కలిసి ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 22 వరకు  ఇంకా గడువు ఉండటంతో త్వరలోనే ప్రభుత్వ బంగ్లాను రాహుల్‌ పూర్తిగా వదిలి వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

క్రిమినల్‌ పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల పాటు శిక్ష విధించగా.. ఆయన తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ పరిణామం నేపథ్యంలో ఏప్రిల్‌ 22లోపు అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలంటూ లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రాహుల్‌ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తున్నారు. 2004 ఎన్నికల్లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన తర్వాత 12- తుగ్లక్‌ లేన్‌లో కేటాయించిన ఈ బంగ్లాలోనే ఇంత కాలం రాహుల్‌ నివాసం ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు