Gold price: అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్‌.. రికార్డు స్థాయికి బంగారం ధర

Gold price today: దేశ రాజధాని దిల్లీలో బంగారం ధర పెరిగింది. 10 గ్రామలపై ఒక్కరోజే రూ.480 పెరిగింది. దీంతో గరిష్ఠ స్థాయికి చేరింది.

Published : 14 Apr 2023 19:12 IST

దిల్లీ: దేశంలో బంగారం ధర మరోసారి పెరిగింది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్‌ ఏర్పడడంతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో ఎప్పుడూ లేని స్థాయిలో స్పాట్‌ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్ల స్వచ్ఛత) బంగారం ధర రూ.480 పెరిగి రూ.61,780కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో రూ.61,300 వద్ద ముగిసింది. వెండి సైతం కిలో రూ.410 పెరిగి రూ.77,580కి చేరింది.

అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగానూ వాటి ధరలకు రెక్కలొచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 2041 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. ఔన్సు వెండి 25.88 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. డాలర్‌, బాండ్ల సూచీల క్షీణత కారణంగా బంగారం కొనుగోలుకు మదుపరులు మొగ్గు చూపుతున్నారని, దీంతో ధరలు పెరుగుతున్నట్లు సౌమిల్‌ గాంధీ పేర్కొన్నారు.

గమనిక: బంగారం ధరల విషయంలో ప్రాంతాన్ని బట్టి వ్యత్యాసం ఉంటుంది. జీఎస్టీతో కలుపు కొంటే ధర ఇంతకంటే ఎక్కువే ఉండొచ్చు. వాస్తవ ధర కోసం మీ దగ్గర్లోని బంగారం దుకాణదారులను సంప్రదించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు