Updated : 06 Oct 2021 09:11 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. అద్భుత పనికరాలు!

కొత్త ఉత్పత్తులతో ఆశ్చర్యంలో ముంచెత్తే అమెజాన్‌ ప్రతిసారీ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. రోజువారీ పనుల్లో ఉపయోగపడే వినూత్న గ్యాడ్జెట్లతో ఈసారి మరింత విస్మయానికి గురిచేసింది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఇవి గృహ పరికరాల రంగంలో కొత్త చరిత్రను సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఎడారులెలా ఏర్పడతాయి?

2. TS News: వరి విత్తనాలు అమ్మకండి

రి సాగు మానేయమని రైతులకు చెబుతున్న వ్యవసాయశాఖ మరో తీవ్ర నిర్ణయం తీసుకుంది. అన్నదాతలకు వరి విత్తనాలు అమ్మవద్దని ప్రైవేటు విత్తన కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది. మంగళవారం విత్తన కంపెనీల ప్రతినిధులతో వ్యవసాయ కమిషనర్‌ రఘునందన్‌రావు సమావేశం నిర్వహించి ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘అమరావతి’ పాఠం తొలగింపు

పదో తరగతి తెలుగు నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించారు. కొత్తగా ముద్రించిన పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ఆయా బడులకు సరఫరా చేసింది. 2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించగా.. సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ఉండేది. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ అందులో వివరించారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ దాన్ని తొలగించి 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇక ధరల తుపాను

గులాబ్‌ తుపాను దెబ్బకు కోస్తాలో కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. వీటిపై మహారాష్ట్రతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లోని భారీవర్షాల ప్రభావం పడింది. అంతకుముందు వర్షాభావంతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూరగాయలు, ఆకుకూరల పంటలు పాడయ్యాయి. ఈ పరిస్థితులన్ని కలిసి రాష్ట్రంలో కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి. పది రోజుల కిందటి వరకు కొనే వారు లేక... రోడ్ల పక్కన పారబోసిన టమాటా, వంగ, బెండ, దొండ, బీర తదితరాలకు గిరాకీ పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Azadi Ka Amrit Mahotsav: ఓర్వలేక ఓడ గొట్టారు!

మూడు దిక్కులా సముద్రాలున్న భారతావని అనాది నుంచీ వ్యాపార వాణిజ్యాలకు ఈ తీరాలను సమర్థంగా వాడుకుంటూ వస్తోంది. మౌర్యుల కాలం నుంచి మొఘలుల దాకా ఎప్పుడు చూసినా ప్రపంచంతో భారత్‌ సముద్ర వాణిజ్యం అలరారింది. అందుకు తగ్గట్లుగానే భారత్‌లో నౌకా నిర్మాణ రంగం వేళ్లూనుకుంది. పురాతన కాలం నుంచీ ప్రపంచంలోని అన్ని సముద్రాల్లో తిరిగి రావటంతోపాటు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Accident: పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన ఆర్టీసీ బస్సు

 పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాడిదులగండిగుట్ట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బెల్లంపల్లి నుంచి హనుమకొండకు వెళ్తున్న పరకాల డిపో బస్సు కారును ఢీకొని అదుపు తప్పి రోడ్డు పక్కన లోయలో పడింది. ప్రమాదంలో కారులో ఉన్న ఖాన్‌సాయిపేటకు చెందిన వినీత్‌ అనే వ్యక్తి మృతిచెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. గుండె జబ్బు... అగ్నిప్రమాదం... కిరీటాన్ని ఆపలేదు!

రెండేళ్ల క్రితం...అమెరికాలో ‘మిస్‌ వరల్డ్‌ అమెరికా’ పోటీలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఆ అందాల కిరీటం ఎవరిని వరించబోతోందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. మిస్‌ స్మైల్‌తో సహా మరో ఐదు టైటిళ్లను గెల్చుకున్న భారతీయ సంతతి అమ్మాయి శ్రీసైనీ మాత్రం తన ఆనందాన్ని ఆ వేదికపై పంచుకోలేకపోయింది. కారణం... తనా వేదికపైనే గుండె పోటుతో కుప్పకూలింది. నిర్వాహకులు.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సైనీ దగ్గరకే వెళ్లి ఆ అవార్డులని అందించి ధైర్యం చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పొదుపు రూ.10 కోట్లు

8. new cities:ఆ వెయ్యి కోట్లు వస్తే! అమరావతికి దన్ను

దేశంలోని ఏ మహానగరానికీ తీసిపోని విధంగా ప్రజారాజధాని అమరావతి వస్తుందని అంతా భావించారు. అన్నీ అమరుతున్నాయనగా.. రాజధాని నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. భూ సమీకరణ, రూ.10 వేల కోట్లతో చేసిన పనులు... వేలమంది శ్రామికుల నిరంతర శ్రమ.. నిష్ఫలంగా మారిపోయాయి. కానీ ఇప్పుడు అనుకోకుండా మరో అవకాశం వచ్చింది. రాజధాని నగర నిర్మాణానికి పదిహేనో ఆర్థికసంఘం ప్రతిపాదించిన పథకం ఆశాకిరణంగా కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Old Vehicles: పాత వాహనాలపై ఛార్జీల వాత

దేశంలో పాత వాహనాల రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరణ ఛార్జీలను కేంద్రం భారీగా పెంచింది. 15ఏళ్లకు పైబడిన కార్ల రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించుకోవాలంటే.. ఇకపై రూ.5 వేలు చెల్లించాలి. ప్రస్తుతం చెల్లిస్తున్న మొత్తం (రూ.600) కంటే ఇది దాదాపు 8 రెట్లు అధికం. జాతీయ వాహన తుక్కు విధానం అమలుకు వీలుగా.. ‘కేంద్ర మోటారు వాహనాల (23వ సవరణ) నిబంధనలు-2021’ పేరుతో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు తాజాగా ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అది భారత జట్టుకు పెద్ద దెబ్బ

ఐపీఎల్‌లో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ చేయకపోవడం భారత జట్టుకు పెద్ద దెబ్బ అని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉన్న పాండ్య.. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున బౌలింగ్‌ చేయని నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. ‘‘హార్దిక్‌ పాండ్య ప్రస్తుతం బౌలింగ్‌ చేయకపోవడం కేవలం ముంబయి ఇండియన్స్‌కు మాత్రమే కాదు భారత జట్టుకు కూడా పెద్ద దెబ్బే. ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌కు అతడిని ఆల్‌రౌండర్‌ కోటాలో ఎంపిక చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Dhoni: చెన్నైలోనే ధోని వీడ్కోలు మ్యాచ్‌!

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని