Updated : 28 May 2022 09:15 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1.  గ్రామాల్లోనూ ఆస్తిపన్ను 5% పెంపు!

గ్రామీణులపై మరో పన్ను పిడుగు పడనుంది. పల్లెల్లో ఆస్తి పన్నును 5% పెంచేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. నిరుడూ ఇలాగే 5 శాతం పెంచారు. ఈ ఏడాది పెంపుపై ఉత్తర్వులేమీ ఇవ్వలేదు. కానీ... పెంచేసి, అమలు చేయాలని మౌఖిక ఆదేశాలు వెలువడ్డాయి. గత సంవత్సరం జారీ చేసిన మార్గదర్శకాలనే అనుసరించాలని పంచాయతీ కార్యదర్శులను జిల్లా పంచాయతీ అధికారులు ఆదేశిస్తున్నారు. ఆస్తి మూల ధన విలువ ఆధారంగా పన్ను విధించాలన్న కొత్త విధానంతో నగరాలు, పట్టణాల్లో రెండేళ్లుగా పన్నులు పెరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. దసరా నుంచి జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్‌

వచ్చే విజయదశమి(దసరా) రోజున సీఎం కేసీఆర్‌ దేశరాజకీయాల్లో చక్రం తిప్పడానికి వెళ్తారంటూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. ఆ రోజు వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారికి పూజలు చేసి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడతారన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రజలంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణంలో శుక్రవారం ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు చేరుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు పుష్పగుచ్ఛాలు ఉంచి తాతను స్మరించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నందమూరి రాముడు.. వెండితెర సార్వభౌముడు

4. Rajasthan vs Bangalore: బట్లర్‌ కొడితే.. ఫైనల్లో

ఈ 15వ సీజన్‌.. ఫైనల్‌ చేరాలంటే చివరి అవకాశం.. లక్ష్యం మరీ చిన్నదేమీ కాదు.. ప్రత్యర్థి తక్కువదేమీ కాదు.. కానీ పవర్‌ ప్లే ముగిసే సరికే ఆ జట్టుకు విజయం తేలికైపోయింది. అప్పుడే సాధించాల్సిన రన్‌రేట్‌ ఓవర్‌కు 6.50 పరుగులుగా మారింది. ఇక మ్యాచ్‌ ఎన్ని ఓవర్లలో ముగుస్తుందనే దానిమీదే ఆసక్తి. అందుకు కారణం బట్లర్‌. అతను బ్యాట్‌ పడితే బౌండరీలు సలామ్‌ కొట్టాయి. సిక్సర్లు ఖాతాలో చేరాయి. మరో సెంచరీ అతడి ఒల్లో వాలింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న అతని జోరుకు రాజస్థాన్‌ తుదిపోరు చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎన్‌కౌంటర్‌లో నేరం ఎవరిది?

రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ శివార్లలో ‘దిశ’పై అత్యాచారం, హత్య తరవాత దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. పోలీసులు, పాలకుల సామర్థ్యం, విశ్వసనీయతపై ప్రజలు, కొన్ని ప్రసార మాధ్యమాల నుంచి తీవ్ర ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘దిశ’కు తక్షణ న్యాయం జరగాలన్న డిమాండు ఊపందుకొంది. ఫలితంగా పాలకులు, పోలీసులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఆ కేసుకు సంబంధించి పోలీసులు వేగంగా స్పందించి నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Aruna Reddy: అనుమతి లేకుండా వీడియో తీశారు: అరుణ రెడ్డి

రీరక ఫిట్‌నెస్‌ పరీక్ష సందర్భంగా ఎలాంటి అనుమతి లేకుండా తన వీడియోను రికార్డు చేశారంటూ సాయ్‌ కోచ్‌ రోహిత్‌ జైస్వాల్‌పై తెలుగు జిమ్నాస్ట్‌ బుద్దా అరుణ రెడ్డి ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భారత జిమ్నాస్టిక్స్‌ సమాఖ్య (జీఎఫ్‌ఐ) నుంచి ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ కోచ్‌ వీడియో తీశారని ఆమె చెబుతోంది. ఆమె ఫిర్యాదు మేరకు ఈ విషయంపై విచారణ కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) ముగ్గురు సభ్యుల కమిటీని శుక్రవారం నియమించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వెండితెర కోటలో.. గృహ ప్రవేశం

నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం... సినీ, రాజకీయ, వ్యాపార, న్యాయ, అధికార, క్రీడా ప్రముఖులు నివాసముండే హిల్స్‌..  అక్కడ ఇల్లు ఉండటమే హోదాగా భావించే చోటు.. విశాలంగా, విలాసవంతమైన, విభిన్న నిర్మాణ శైలితో చూపరులను కట్టేపడేసే గృహాలు.. రోడ్‌ నంబర్లే ల్యాండ్‌మార్క్‌లు... మెరిసేపోయే రహదారులు.. కాలనీల్లో పరుచుకున్న పచ్చదనం.. సకల సౌకర్యాలతో నగరం నడిబొడ్డున ఉన్న రియల్‌ ఎస్టేట్‌ హాట్‌ స్పాటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని చాలామంది కలలు కంటుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. TDP and YSRCP: ఖర్చులో తెదేపా ప్రథమం.. మిగులులో వైకాపా

వచ్చిన విరాళాలను ఖర్చు చేయకుండా అట్టే పెట్టుకున్న పార్టీల్లో వైకాపా దేశంలో మొదటి స్థానంలో నిలవగా.. వచ్చిన ఆదాయం కంటే 1,584.16% ఎక్కువగా ఖర్చు చేసి తెదేపా తొలి స్థానాన్ని ఆక్రమించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయవ్యయ లెక్కల ఆధారంగా అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వైకాపాకు రూ.107.89 కోట్ల విరాళాలు రాగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కొవిడ్‌ తర్వాత కాఫీ తాగినా చెత్త కంపు కొడుతోందా

 ‘కాఫీ వాసన మురికి కంపును తలపిస్తోంది.. చేపలు తిన్నా అదే రోత వాసన.. భరించలేకపోతున్నాం..’ అని కొవిడ్‌-19 సోకిన వారిలో చాలా మంది ఫిర్యాదు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఈ కొవిడ్‌ అనంతర లక్షణానికి గురయ్యారు. ఇలా వాసన తెలియకపోవడాన్ని వైద్య పరిభాషలో ‘పరోస్మియా’ అంటారు. ఇది సోకిన వారికి సుపరిచిత వాసనలు కూడా వికారంగా అనిపిస్తాయి. దీంతో బాధితుల ఆహారపు అలవాట్లు ప్రభావానికి లోనవుతాయి. వారి మానసిక ఆరోగ్యమూ దెబ్బతింటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఈ రైలు రాక.. ఏడాది ఆలస్యం!

10. అలవాట్లే.. పెళ్లికి అడ్డా?

కొన్నాళ్లుగా నేనొక అబ్బాయితో ప్రేమలో ఉన్నా. తను చాలా మంచివాడు. మంచి ఉద్యోగమూ ఉంది. కాకపోతే తను ఉత్తరాదికి చెందినవాడు. అయినా తననే పెళ్లి చేసుకుంటానని మావాళ్లతో చెప్పాను. ‘ప్రేమ పెళ్లికి మాకేం అభ్యంతరం లేదు గానీ భాష, ఆచారాలు, అలవాట్ల పరంగా ఇబ్బందులు వస్తాయి. తర్వాత నువ్వే బాధ పడతావు’ అంటున్నారు. బాగా ఆలోచిస్తే వాళ్లు చెప్పిందీ నిజమే అనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని