Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 16 Mar 2024 09:00 IST

1. ఉద్యోగులకు డీఏలతో జగన్‌ ఎన్నికల వల

అధికారపీఠం ఎక్కినప్పటి నుంచి ఉద్యోగులపై కక్షకట్టినట్టు వ్యవహరించిన సీఎం జగన్‌.. ఎన్నికల షెడ్యూలు విడుదలకు ఒకరోజు ముందు వారిని మభ్యపెట్టేందుకు రెండు డీఏలను ప్రకటించారు. ఉద్యోగసంఘాల నేతలు, ఉద్యోగులు గత కొన్ని నెలలుగా పెండింగ్‌ డీఏలు ఇవ్వాలని నెత్తీనోరూ కొట్టుకుని మొత్తుకున్నా చెవికి ఎక్కించుకోలేదు. సంఘాల నేతలు క్యాంపు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోలేదు. పూర్తి కథనం

2. భద్రతమస్తు!

తెలంగాణ పోలీసులు రూపొందించిన టీ- సేఫ్‌ యాప్‌ను రాష్ట్ర సచివాలయంలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. దీని ద్వారా రాత్రివేళల్లో మహిళల ప్రయాణ భద్రతను పోలీసులు పర్యవేక్షిస్తూ ఉండవచ్చు. ప్రయాణ సమయాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు అనుకోని సంఘటనలు సంభవిస్తే పోలీసుల సహాయాన్ని తీసుకోవడానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుంది.పూర్తి కథనం

3. సంక్షేమ పథకాల పంపిణీలోనూ వాలంటీర్లు వద్దు

ఎన్నికలు పూర్తయ్యే వరకు లబ్ధిదారులకు సంక్షేమ పథకాల పంపిణీలోనూ వాలంటీర్లను దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) కార్యదర్శి డాక్టర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కోరారు. పింఛన్లు, రేషన్‌, ఇతర ప్రయోజనాల పంపిణీలో వాలంటీర్లను కొనసాగించడం వల్ల ఎన్నికల విధులకు వారిని దూరంగా ఉంచాలని సీఎస్‌ ఇచ్చిన ఆదేశాలు అపహాస్యమవుతాయన్నారు.పూర్తి కథనం

4. ‘బతికున్నా చనిపోయినట్లు ధ్రువపత్రం ఇచ్చారు’

తాను బతికి ఉన్నా చనిపోయినట్లు అధికారులు తప్పుడు ధ్రువీకరణ పత్రం జారీ చేశారని ఆరోపిస్తూ కాగజ్‌నగర్‌ మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన ఆరేపల్లి పద్మ హైదరాబాద్‌ ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పూర్తి కథనం

5. జలకళకు జగన్‌ పాతర..!

చిన్నకారు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జలకళ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా సాగునీటికి ఇబ్బందిపడే రైతులకు ప్రభుత్వమే బోర్లు వేసి ఇచ్చేందుకు నిర్ణయించింది. పక్కపక్కనే సుమారు 2.50 ఎకరాల భూమి ఉన్న రైతు లేదా సమూహంగా ఉండే రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఎస్సీ, ఎస్టీ, మహిళ రైతులకు ప్రాధాన్యం ఇస్తామంటూ ప్రకటించారు. మొత్తం ఆమోదించిన 5,661 దరఖాస్తుల్లో కేవలం 533 బోర్లు (9.41%) మాత్రమే తవ్వారు.పూర్తి కథనం

6.కాంగ్రెస్‌ పాలనపై సానుకూలత ఉంది.. గుత్తా సుఖేందర్‌రెడ్డి

వంద రోజుల కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్గొండలోని తన నివాసంలో శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడారు. ఏ పార్టీకీ సంబంధం లేని రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నానని.. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు. పూర్తి కథనం

7. లక్షణమైన నటన.. కోటి మంది వీక్షణ

ఒకప్పుడు సినిమాల్లో నటించే వారికే గుర్తింపు వచ్చేది. ఆ రంగంలోని దర్శకులు, నిర్మాతలే వెలుగొందే వారు. నటన, రచనా రంగంలో ఎంత ప్రతిభ ఉన్నా సామాన్యులకు, సాధారణ ప్రజానీకానికి అవకాశాలు అందని ద్రాక్షగానే మిగిలేది. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌్ ఛానళ్లు అందుబాటులోకొచ్చాక ప్రతిభ ఉంటే ఎవరైనా, ఎక్కడి నుంచైనా .హీరోలుగా మారేందుకు, దర్శకత్వం వహించేందుకు దారులు దగ్గరయ్యాయి.పూర్తి కథనం

8. జగనన్నా.. ముఖం ఎలా చూపాలన్నా..!

వెదురుకుప్పం మండలం  కురివికుప్పం ఎస్సీ కాలనీకి దారి, తాగునీటి సదుపాయం లేదని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పర్యటించినప్పుడు స్థానికుడు ఒకరు ఆయన్ను నిలదీశారు. సమస్య పరిష్కరిస్తానని అప్పట్లో ఆయన హామీ ఇచ్చి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు.పూర్తి కథనం

9. పోలీస్‌.. పైసా వసూల్‌

కాటారం పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో పలు ఠాణాల్లో కానిస్టేబుళ్ల హవా నడుస్తోంది. ఏదైనా ఫిర్యాదు.. లేదా కేసుకు సంబంధించిన బాధితులు వస్తే వారిదే పెత్తనం.. ముందుగానే వారితో సంప్రదింపులు చేస్తూ అన్నీ వారి కనుసన్నల్లోనే పనులు కానిచ్చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఠాణా పరిధిలో మద్యం, గొలుసు దుకాణాల్లో దావతులు చేసుకుంటూ, మద్యం తాగడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.పూర్తి కథనం

10. విశాఖ ఉక్కుపై పగెందుకు జగన్‌?

‘ఆంధ్రుల హక్కుగా’ ప్రజల గుండెల్లో నిలిచిన విశాఖ ఉక్కును ఊచకోత కోసిన పాపం జగన్‌దే. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామని చెప్పి, కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రం ముందు సాగిలపడ్డారు. ప్రైవేటీకరణకు అడుగులు వేసిన కేంద్ర నిర్ణయాల కంటే దారుణంగా ఉక్కు ఊపిరి జగనే తీశారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని