విశాఖ ఉక్కుపై పగెందుకు జగన్‌?

‘ఆంధ్రుల హక్కుగా’ ప్రజల గుండెల్లో నిలిచిన విశాఖ ఉక్కును ఊచకోత కోసిన పాపం జగన్‌దే. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామని చెప్పి, కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రం ముందు సాగిలపడ్డారు.

Updated : 16 Mar 2024 05:46 IST

కేంద్రం మెడలు వంచుతామని... మీరే ఊపిరి తీశారు
ప్రశ్నిస్తే పక్క రాష్ట్రాల్లో ప్రైవేటీకరణ ఆగలేదా?
నేడు ఉక్కు మైదానంలో కాంగ్రెస్‌ బహిరంగ సభపై అందరి దృష్టి

ఈనాడు, విశాఖపట్నం: ‘ఆంధ్రుల హక్కుగా’ ప్రజల గుండెల్లో నిలిచిన విశాఖ ఉక్కును ఊచకోత కోసిన పాపం జగన్‌దే. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామని చెప్పి, కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రం ముందు సాగిలపడ్డారు. ప్రైవేటీకరణకు అడుగులు వేసిన కేంద్ర నిర్ణయాల కంటే దారుణంగా ఉక్కు ఊపిరి జగనే తీశారు. ఉక్కు నగరంలోని త్రిష్ణ మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘న్యాయసాధన’ పేరుతో భారీ బహిరంగ సభ శనివారం నిర్వహించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, పలువురు నాయకులు హాజరుకానున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహిస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించనున్నారు. 1100 రోజుల్లో ఒక్కసారీ సీఎం జగన్‌ వచ్చి ఉద్యమానికి మద్దతు తెలపలేదు. ఈ నేపథ్యంలో శనివారం నాటి సభకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రానుండటం, ఉక్కు పరిరక్షణకు డిక్లరేషన్‌ను ప్రకటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

బతిమిలాడినా జగన్‌ కనికరించలేదు

రూ.2.75 లక్షల కోట్లు ఇచ్చానని పదేపదే చెప్పే జగన్‌.. విశాఖ ఉక్కుకు రూ.2వేల కోట్ల ఆర్థికసాయం చేయకుండా ముఖం చాటేశారు. ఏటా రూ.25 వేల కోట్ల టర్నోవర్‌ ఉన్న విశాఖ ఉక్కు నుంచి జీఎస్టీ రూపంలో రాష్ట్రవాటాగా రూ.2 వేల కోట్లపైగా వస్తుంది. స్టీలుప్లాంటు ఉద్యోగులు ఏటా అందుకునే రూ.1100 కోట్ల జీతభత్యాలపైనా పన్నుల రూపంలో ఖజానాకు జమ అవుతున్నాయి. అయినా, ‘ఉచితంగా వద్దు.. అప్పుగా రూ.500 కోట్ల చొప్పున నాలుగు నెలలు ఆర్థికసాయం చేసి, ప్రతిగా ఉక్కు తీసుకెళ్లండి’ అంటూ ఉద్యోగ, కార్మికసంఘాల ప్రతినిధులు ఓ వినతి ఇచ్చారు. పేదలకు ఇళ్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు విశాఖ ఉక్కు తీసుకోవాలని కోరినా జగన్‌ కనికరించలేదు. పైగా కంటితుడుపుగా ఓ అధికారి ఆధ్వర్యంలో కమిటీ వేసి, సాధ్యాసాధ్యాలపై నివేదికలివ్వాలని చెప్పడం మరో మోసమే కదా అని కార్మికసంఘాలు మండిపడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని