Telangana News: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌ నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి తూప్రాన్‌ గేట్‌ సమీపం వరకు విజయవాడ- హైదరాబాద్‌ 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. ఇటీవల కురిసిన

Updated : 12 Aug 2022 20:02 IST

అబ్దుల్లాపూర్‌మెట్‌: హైదరాబాద్‌ నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి తూప్రాన్‌ గేట్‌ సమీపం వరకు విజయవాడ- హైదరాబాద్‌ 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో అధ్వానంగా మారిన రహదారి మరమ్మతులు చేపట్టారు. ఓ వైపు రాఖీపౌర్ణమి రద్దీ, మరో పక్క రహదారి మరమ్మతులు చేపట్టడంతో శుక్రవారం సాయంత్రం నుంచి వాహనాల రద్దీ పెరిగింది. జాతీయ రహదారి మరమ్మతుల కారణంగా వాహనాలను ఒకే దారిలో మళ్లించడంతో ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతోంది. దీంతో సుమారు 4కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి. ట్రాఫిక్‌ పోలీసులు, అబ్దుల్లాపూర్‌మెట్‌, చౌటుప్పల్‌ పోలీసులు ట్రాఫిక్‌ క్రమబద్దీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్ల మరమ్మతు పనులు ట్రాఫిక్ లేనప్పుడు, రాత్రి సమయాల్లో  చేస్తే బాగుండేదని, రద్దీ సమయంలో చేయడం వల్ల తాము ఇబ్బందులకు గురవుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని