Holiday trip: విహారయాత్రలకు సిద్ధమవుతున్న భారతీయులు.. టాప్ డెస్టినేషన్లు ఇవే!
కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాదిన్నరగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మధ్యలో లాక్‌డౌన్ ఎత్తేసినా.. కరోనా కేసుల భయంతో బయటకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. మరోవైపు దేశాలు, రాష్ట్రాలు కొవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితులు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాదిన్నరగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మధ్యలో లాక్‌డౌన్ ఎత్తేసినా.. కరోనా కేసుల భయంతో బయటకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. మరోవైపు కొవిడ్ నిబంధనలు అమలవుతున్నాయి. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితులు మారుతున్నాయి. అన్ని చోట్ల ప్రజలకు వ్యాక్సిన్ వేస్తుండటంతో పర్యటకులను ఆహ్వానించేందుకు దేశాలు, రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఎప్పుడు నిబంధనలు తొలగిస్తారా? ఎప్పుడు విహారయాత్రకు వెళ్లిపోదామా అని భారతీయులు తెగ ఎదురుచూస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈనెలలో గత ఐదు రోజుల్లో భారతీయులు గూగుల్‌లో వెతికిన హాలీడే ట్రిప్ డెస్టినేషన్ ప్రాంతాల ఆధారంగా బుకింగ్.కామ్ అనే సంస్థ టాప్ 10 అంతర్జాతీయ, దేశీయ డెస్టినేషన్ జాబితాలను విడుదల చేసింది. మరి ఆ జాబితాలో ఏయే ప్రాంతాలున్నాయో చూద్దాం..!
విదేశీ విహారయాత్ర చేయాలనుకునేవారు ఎంచుకున్న దేశాల్లో యూఎస్‌ఏ, రష్యా, మాల్దీవులు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత స్విట్జర్లాండ్, ఖతర్, కెనడా, యూకే, మెక్సికో, అర్మేనియా, ఫ్రాన్స్ దేశాలున్నాయి. ఈ దేశాల్లో చూడదగ్గ ప్రాంతాల గురించి భారతీయ పర్యటకులు గూగుల్‌లో ఎక్కువగా అన్వేషించారట. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తే ఈ దేశాలను సందర్శించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ ఏడాది దేశీయ పర్యటక ప్రాంతాలను చూడాలని ఎక్కువ మంది భారతీయులు ఆసక్తి చూపుతున్నట్లు బుకింగ్.కామ్ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా దేశంలోని మెట్రో సిటీల గురించి, వాటికి దగ్గర్లో ఉండే పర్యటక ప్రాంతాల గురించి ఎక్కువగా గూగుల్ చేశారట. మొత్తంగా దేశీయ డెస్టినేషన్లలో తొలిస్థానంలో దేశ రాజధాని దిల్లీ ఉంది. రెండో స్థానంలో ముంబయి నగరం ఉండగా.. ముంబయికి సమీపంలో ఉండే లోనావాలా మూడో స్థానంలో నిలిచింది. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, జయపుర, హైదరాబాద్, లేహ్, ఉదయ్‌పూర్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Team India: ధావన్ వస్తాడా...? ఇషాన్‌కే అవకాశాలు ఇస్తారా..? అశ్విన్ స్పందన ఇదీ..
-
General News
CM Jagan: త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నా: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
-
India News
Economic Survey 2023: లోక్‌సభ ముందు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Ileana: ఆసుపత్రిలో చేరిన ఇలియానా.. త్వరగా కోలుకోవాలంటున్న ఫ్యాన్స్
-
India News
Droupadi Murmu: ధైర్యవంతమైన ప్రభుత్వం.. విప్లవాత్మక నిర్ణయాలు: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము