Vishakhapatnam: ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించిన గిరిజన భాష వాలంటీర్లు..!

విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ కార్యాలయాన్ని గిరిజన భాష వాలంటీర్లు ముట్టడించారు. ఏజెన్సీలో పనిచేస్తున్న 700 మంది

Published : 20 Dec 2021 23:28 IST

విశాఖపట్నం: విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ కార్యాలయాన్ని గిరిజన భాష వాలంటీర్లు ముట్టడించారు. ఏజెన్సీలో పనిచేస్తున్న 700 మంది భాషా వాలంటీర్లను రెన్యువల్‌ చేయాలంటూ రెండువారాలుగా ఐటీడీఏ ఎదుటvరిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. మూడు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోవడంతో.. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని