TS High Court: 500మందితో భాజపా మహాధర్నాకు హైకోర్టు అనుమతి
తెలంగాణ భాజపా శనివారం చేపట్టే మహాధర్నాకు హైకోర్టు అనుమతిచ్చింది. కానీ, ధర్నాలో 500 మంది మాత్రమే పాల్గొనాలని.. ఎవరూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయరాదని షరతులు విధించింది.
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీకేజీ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ (BJP) శనివారం ఇందిరాపార్కు వద్ద చేపట్టే మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ధర్నాలో 500 మంది మాత్రమే పాల్గొనాలని సూచించింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. తొలుత మహాధర్నాకు పోలీసులు నిరాకరించడంతో భాజపా హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మహాధర్నాకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
తొలుత సుమారు 300 నుంచి 500 మంది వరకు హాజరు కానున్న ధర్నాకు అనుమతివ్వాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి పోలీసులకు మెయిల్ పంపించారు. దీనికి పోలీసులు స్పందించక పోవడంతో ఆయన హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీసులు ధర్నాకు అనుమతి నిరాకరించినట్లు హైకోర్టుకు నివేదించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై భాజపా ధర్నా చేస్తోందని.. అయితే ఆధారాలు ఇవ్వమని బండి సంజయ్‌ని కోరితే విచారణకు సహకరించ లేదని కోర్టుకు తెలిపారు.
వాదలను విన్న న్యాయస్థానం.. ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం సహేతుకంగా, చట్టబద్ధంగా లేదని వ్యాఖ్యానించింది. ధర్నా చౌక్ వద్ద అనుమతి ఇవ్వకపోతే ప్రజలు ధర్నా ఎక్కడ చేసుకుంటారని ప్రశ్నించింది. నిరసన తెలిపే హక్కు ప్రజలకు రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేసింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం విషయంలో తప్పులు జరిగితే ప్రభుత్వం, ప్రజల నిరసనలను ఎదుర్కోవాలని వ్యాఖ్యానించింది. అనంతరం ధర్నాకు షరతులతో కూడిన అనుమతిచ్చింది. ధర్నాలో 500 మందికి మించరాదని ఆదేశిస్తూ.. భద్రత కల్పించేందుకు వీలుగా ధర్నాకు హాజరయ్యే జాతీయ, రాష్ట్ర, ఇతర స్థాయి నేతల వివరాలను పోలీసులకు ఇవ్వాలని భాజపాకు సూచించింది. ధర్నాకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ధర్నాలో పాల్గొన్న నేతలు శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని భాజపాకు స్పష్టం చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nadendla Manohar: ‘సీట్ల సర్దుబాటుపై పవన్, చంద్రబాబు చర్చించుకుంటారు’
-
Ap-top-news News
నేడు జేఈఈ అడ్వాన్స్డ్
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!