TS News:  ఫ్రాన్స్‌లో కేటీఆర్‌ పర్యటన .. మిస్సైల్స్‌, ఎంబీడీఏ ప్రతినిధులతో భేటీ

ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర బృందం రెండో రోజు పలు కంపెనీల సీఈవోలు, అధిపతులతో సమావేశమైంది. మిస్సైల్‌,  మిస్సైల్‌ సిస్టమ్స్‌లో

Updated : 29 Oct 2021 11:03 IST

హైదరాబాద్‌‌: ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర బృందం రెండో రోజు పలు కంపెనీల సీఈవోలు, అధిపతులతో సమావేశమైంది. మిస్సైల్‌,  మిస్సైల్‌ సిస్టమ్స్‌లో ప్రఖ్యాతిగాంచిన పారిస్‌కు చెందిన ఎంబీడీఏ కంపెనీ డైరెక్టర్లు బోరిస్‌ సోలోమియాక్‌, పాల్‌ నీల్‌ లే లివెక్‌, ఇతర ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్‌.. తెలంగాణలో తయారీ రంగం అవకాశాలను వివరించారు. అవకాశాలను తెలుసుకునేందుకు రాష్ట్రంలో పర్యటించాలని ఎంబీడీఏ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు. ఏరో క్యాంపస్‌ ఆక్విటైన్‌ సంస్థ డైరెక్టర్‌ జేవియర్‌ ఆడియాన్, ఇతర ప్రతినిధులతోనూ మంత్రి సమావేశమయ్యారు. ఫ్రాన్స్‌లోని భారత రాయబారి జావెద్‌ ఆష్రాఫ్‌తో సమావేశమైన కేటీఆర్‌.. వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఫ్రెంచ్‌ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉన్న రంగాల గురించి తెలిపారు. 800 కంపెనీలతో కూడిన కాస్మోటిక్‌ వ్యాలీ క్లస్టర్‌ డిప్యూటీ సీఈవో ఫ్రాంకీ బెచెర్యూతో సమావేశమైన మంత్రి.. భారతదేశ కాస్మోటిక్‌ మార్కెట్‌ గురించి వివరించారు. తెలంగాణలో కాస్మోటిక్స్‌ తయారీ అవకాశాలను వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని