TSRTC: నిరుద్యోగ యువతకు టీఎస్‌ఆర్‌టీసీ గుడ్‌న్యూస్

తెలంగాణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) శుభవార్త తెలియజేసింది. సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్ పాస్‌లపై 20శాతం తగ్గిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మూడు నెలలపాటు...

Published : 01 May 2022 01:55 IST

హైదరాబాద్: తెలంగాణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) శుభవార్త తెలియజేసింది. సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్ పాస్‌లపై 20శాతం రాయితీ కల్పిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మూడు నెలలపాటు ఈ పాస్‌లను కొనసాగిస్తామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ వెల్లడించారు. బస్‌పాస్‌ల కోసం దరఖాస్తు చేయాలనుకునే యువతీ యువకులు ఆధార్ కార్డు జిరాక్స్, కోచింగ్ సెంటర్‌కు సంబంధించిన ఐడీ కార్డు జిరాక్స్, నిరుద్యోగ గుర్తింపు కార్డులలో ఏదో ఒకదాన్ని బస్‌పాస్‌ తీసుకునే సమయంలో అందజేయాలని ఆర్టీసీ తెలిపింది. మూడు నెలలకు గాను ప్రస్తుతం ఆర్డినరీ బస్‌పాస్‌లకు రూ.3,450 వసూలు చేస్తున్నారు. 20శాతం తగ్గించిన తర్వాత రౌండప్ చేసి రూ.2,800 వసూలు చేయనున్నారు. అదే విధంగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌కు ప్రస్తుతం రూ.3,900 వసూలు చేస్తున్నారు. 20శాతం రాయితీ పోగా రౌండప్‌ చేసి రూ.3,200 వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.

తెలంగాణ ఆర్టీసీ నూతన కాల్ సెంటర్‌ను ప్రారంభించినట్లు యాజమాన్యం తెలిపింది. 040-2345-0033, 040-6944-0000 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. 24 గంటల సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌టీసీ సూచించింది. రిజర్వేషన్ రద్దుకు సంబంధించిన నగదు, బస్సుల వివరాలు ఈ నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆర్టీసీ తెలిపింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని