Hyderabad: మహిళా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ మరో శుభవార్త..

మహిళా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) మరో శుభవార్త తెలిపింది. కోఠి - కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును ఆర్టీసీ నడపనుంది.

Updated : 18 Aug 2023 19:49 IST

హైదరాబాద్‌: మహిళా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) మరో శుభవార్త తెలిపింది. కోఠి - కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును ఆర్టీసీ నడపనుంది. 127K నంబర్‌తో నడిచే ఈ లేడీస్ స్పెషల్ బస్సు.. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లక్డీకాపుల్, మాసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, గుట్టల బేగంపేట, శిల్పారామం, కొత్తగూడ క్రాస్‌రోడ్‌ మీదుగా కొండాపూర్‌కు వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి వస్తుంది. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని