MLAs Bribery case: కేసీఆర్‌ రాజకీయ అజెండా మేరకే సిట్‌ దర్యాప్తు.. హైకోర్టులో తుషార్‌ పిటిషన్‌

ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేరళ బీడీజేఎస్‌ అధ్యక్షుడు తుషార్‌ వెల్లపల్లి పిటిషన్‌ వేశారు. ఈ  కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరారు.

Published : 28 Nov 2022 18:07 IST

హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేరళ బీడీజేఎస్‌ అధ్యక్షుడు తుషార్‌ వెల్లపల్లి పిటిషన్‌ వేశారు. ఈ  కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌లో సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా తుషార్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ రాజకీయ అజెండా మేరకే సిట్‌ దర్యాప్తు చేస్తోందని తుషార్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 21న విచారణకు రావాలని 16న 41ఏ సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారన్నారు. అనారోగ్యం వల్ల వైద్యుల సూచన మేరకు 2 వారాల గడువు కోరుతూ మెయిల్‌ చేసినట్లు చెప్పారు. అయితే, తన మెయిల్‌కు సమాధానం ఇవ్వకుండా లుకౌట్‌ నోటీసు ఇవ్వడం రాజకీయ దురుద్దేశమే అవుతుందని పిటిషన్‌లో తుషార్‌ పేర్కొన్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు