Ts News: తెలంగాణలో 2 పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు సర్కార్‌ ఆమోదం

తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు పట్టణాభివృద్ధి సంస్థలు ఏర్పాటయ్యాయి. నీలగిరి పట్టణాభివృద్ధి సంస్థ, మహబూబ్‌నగర్‌ పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు

Updated : 14 Feb 2022 20:16 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు పట్టణాభివృద్ధి సంస్థలు ఏర్పాటయ్యాయి. నీలగిరి పట్టణాభివృద్ధి సంస్థ, మహబూబ్‌నగర్‌ పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ మున్సిపాల్టీతో పాటు 42 గ్రామాలను కలుపుతూ నీలగిరి పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. నల్గొండ మండలానికి చెందిన 22, తిప్పర్తి మండలానికి చెందిన 9, కనగల్ మండలానికి చెందిన 6 గ్రామాలను ఇందులో చేర్చారు. నార్కట్‌పల్లి, నకిరేకల్ మండలాలకు చెందిన 2 చొప్పున గ్రామాలు, కట్టంగూర్ మండలానికి చెందిన ఒక గ్రామాన్ని నీలగిరి పట్టణాభివృద్ధి సంస్థలో కలిపేశారు. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, నల్గొండ మున్సిపల్ కమిషనర్ వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, లింగయ్య, ఎమ్మెల్సీ కోటిరెడ్డితో పాటు అధికారులు సభ్యులుగా ఉంటారు.

మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాల్టీలతో పాటు మరో 142 గ్రామాలతో మహబూబ్‌నగర్ పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటైంది. మహబూబ్‌నగర్ రూరల్ మండలానికి చెందిన 16, హన్వాడ మండలానికి చెందిన 13, నవాబ్ పేట మండలంలోని 20 గ్రామాలను ఇందులో చేర్చారు. రాజాపూర్ మండలంలోని 16, జడ్చర్ల మండలంలోని 22, భూత్పూర్ మండలంలోని 13, మూసాపేట మండలంలోని 12 గ్రామాలు ఈ జాబితాలో ఉన్నాయి. దేవరకద్ర మండలానికి చెందిన 5, కోయిల్ కొండ మండలానికి చెందిన 8,  గండీడ్ మండలానికి చెందిన ఒక గ్రామంతో పాటు బాలానగర్ మండలానికి చెందిన 15 గ్రామాలను మహబూబ్‌నగర్ పట్టణాభివృద్ధి సంస్థలో చేర్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, వైస్ ఛైర్మన్‌గా మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తారు. ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డితో పాటు పలువురు అధికారులు సభ్యులుగా ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని