Viveka Murder Case: హైకోర్టులో వాదనలు.. వివేకా కుమార్తె సునీత హాజరు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వై.సునీల్‌ యాదవ్‌ (ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (ఏ3), దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (ఏ5) బెయిల్‌ కోసం దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.

Updated : 04 May 2022 12:07 IST

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వై.సునీల్‌ యాదవ్‌ (ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (ఏ3), దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (ఏ5) బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే నిందితుల తరఫు వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ సీబీఐ, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో సునీత న్యాయస్థానానికి హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ మీద ఉన్నారు. నిందితుల నుంచి వాంగ్మూలాలు సేకరించారని.. వారికి ఎటువంటి ప్రాణహాని లేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అందువల్ల నిందితులకు బెయిల్‌ ఇవ్వాలని ఇప్పటికే కోర్టును కోరారు. 

గత సోమవారం శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ప్రారంభం కాగానే సునీత తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తమ వాదనలూ వినాలని అనుబంధ పిటిషన్‌ (ఇంప్లీడ్‌) దాఖలు చేశామని తెలిపారు. మృతుడి కుమార్తెగా ఆమె ఇంప్లీడ్‌ అయ్యేందుకు అర్హత ఉందని చెప్పారు. గతంలో శివశంకర్‌రెడ్డి పిటిషన్‌ను ఓ న్యాయమూర్తి కొట్టేశారని, ప్రస్తుత వ్యాజ్యం అక్కడికే విచారణకు వెళ్లాలని కోర్టు దృష్టికి తెచ్చిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని