
విమానంలో శిశువుకు జన్మనిచ్చిన మహిళ
జైపూర్: బెంగళూరు నుంచి జైపూర్ బయలుదేరిన విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు ప్రసవించింది. మహిళకు నొప్పులు రావడంతో విమానంలోనే ఉన్న ఓ డాక్టర్ సాయంతో విమాన సిబ్బంది ఆమెకు కాన్పు చేశారు. ఆడ శిశువు జన్మించగా తల్లి, శిశువు ఆరోగ్యంగా నిలకడగా ఉన్నట్లు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. విమానం జైపూర్ చేరుకోగానే ముందే సిద్ధం చేసిన అంబులెన్స్‌లో తల్లీబిడ్డను ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికురాలికి డాక్టర్ షబానా నాజిర్ పురుడుపోశారని సంస్థ పేర్కొంది. తన సిబ్బంది మహిళకు సాయం చేసి గొప్ప పని చేశారని ఇండిగో ప్రకటించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.