Kurnool: కన్నతల్లిపై ఎమ్మిగనూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ దౌర్జన్యం.. వీడియో వైరల్‌

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్ రఘు.. తన తల్లి, కౌన్సిలర్ సరోజమ్మపై దౌర్జన్యానికి పాల్పడిన దృశ్యాలు..

Published : 23 Dec 2021 01:17 IST

ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్ రఘు.. తన తల్లి, కౌన్సిలర్ సరోజమ్మపై దౌర్జన్యానికి పాల్పడిన దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి రఘుపై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘుకు.. తన తల్లిదండ్రులు, సోదరుడితో ఆస్తి వివాదాలు ఉన్నట్టు తెలుస్తోంది. రఘు తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సివిల్‌ అంశంగా పేర్కొంటూ వెనక్కి పంపారు. దీంతో ఆమె న్యాయమూర్తిని కలిసి అర్జీ ఇచ్చారు.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని