Andhra News: పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్‌ ఇంటిపై వైకాపా కార్యకర్తల దాడి

చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంటిపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మరోవైపు ఆయన నిర్వహించ తలపెట్టిన రైతు భేరి సభకు వెళ్లకుండా పోలీసులు ఉదయం నుంచి అడ్డుకున్నారు.

Published : 04 Dec 2022 23:54 IST

చిత్తూరు: జిల్లాలోని పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంటిపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మరోవైపు ఆయన నిర్వహించ తలపెట్టిన రైతు భేరి సభకు వెళ్లకుండా పోలీసులు ఉదయం నుంచి అడ్డుకున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత పోలీసులు ఆయనని వదిలేశారు. దీంతో రామచంద్ర యాదవ్‌ పుంగనూరులో పాదయాత్ర చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అధికార నాయకులు రైతు భేరిని అడ్డుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు. దీంతో ఆదివారం రాత్రి వైకాపా నాయకులు ఆయన ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేశారు. కిటికీ అద్దాలు పగలగొట్టారు. ఇంటి ఆవరణలోని వాహనాలు, కుర్చీలను ధ్వంసం చేశారు. వైకాపా కార్యకర్తల దాడి సమయంలో రామచంద్ర యాదవ్ ఇంట్లోనే ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన ఇంటికి వచ్చి దాడి చేస్తున్న వారిని చెదరగొట్టారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని