Zomato: ఇకపై ఆర్డర్‌ చేస్తే.. ప్లాస్టిక్‌ స్పూన్స్‌ రావు 

ప్లాస్టిక్.. పర్యావరణానికి ఎంత హాని చేస్తుందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఫుడ్‌ బిజినెస్‌ యాప్స్‌.. ఈ ప్లాస్టిక్‌ మీదే ఆధారపడి తమ ఆహారాన్ని కస్టమర్లకు అందజేస్తాయి. తాజాగా ఇదే అంశం పై ట్వీట్‌ చేశారు జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌. అదేంటంటే.. జొమాటో యాప్‌లో ఇకపై ఆర్డర్‌ చేసేటప్పుడు కట్లరీ( ప్లాస్టిక్‌ స్పూన్లు, ఫొర్క్స్‌) వద్దనుకుంటే స్కిప్‌ చేయొచ్చట. అందుకే ఆర్డర్‌ పెట్టేటప్పుడు ఇన్‌, అవుట్‌ ఆప్షన్‌ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

Published : 31 Aug 2021 01:44 IST

పర్యావరణ పరిరక్షణ కోసమే ఇలా!

దిల్లీ: ప్లాస్టిక్.. పర్యావరణానికి ఎంత హాని చేస్తుందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఫుడ్‌ బిజినెస్‌ యాప్స్‌.. ఈ ప్లాస్టిక్‌ మీదే ఆధారపడి తమ ఆహారాన్ని కస్టమర్లకు అందజేస్తాయి. తాజాగా ఇదే అంశం పై ట్వీట్‌ చేశారు జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌. అదేంటంటే.. జొమాటో యాప్‌లో ఇకపై ఆర్డర్‌ చేసేటప్పుడు కట్లరీ( ప్లాస్టిక్‌ స్పూన్లు, ఫొర్క్స్‌) వద్దనుకుంటే స్కిప్‌ చేయొచ్చట. అందుకే ఆర్డర్‌ పెట్టేటప్పుడు ఇన్‌, అవుట్‌ ఆప్షన్‌ని అందుబాటులోకి తీసుకురానున్నారు. కస్టమర్‌కి కట్లరీ, టిష్యూలు, స్ర్టా.. కావాలనుకుంటే రిక్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ‘‘ఈ చిన్న మార్పుతో పర్యావరణాన్ని కాపాడొచ్చు. మీరు ఇలా చేయాలనుకుంటే.. దయచేసి కట్లరీకి నో చెప్పి మీ వంతు సాయం చేయండి’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ మార్పుకు వెనుక గల కారణాన్ని ప్రస్తావించారు దీపిందర్‌. ఇటీవలే వేల మంది కస్టమర్లతో నిర్వహించిన ఓ సర్వేలో 90శాతం మంది తమకు ప్లాస్టిక్‌ వస్తువులు వద్దంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల రెస్టారెంట్‌ వాళ్లకు ఒక్కో ఆర్డర్‌ నుంచి రూ. 2 నుంచి 5 వరకు ఖర్చు మిగలనుంది. అందుకే ఇకపై ఈ పద్ధతిని అనుసరించాల్సిందిగా జొమాటో రెస్టారెంట్లకు కూడా విజ్ఞప్తి చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని